లేబర్​ మర్చిపోలేని లీడర్

గురుదాస్ ​దాస్​గుప్తా… కమిట్​మెంట్​ అంటే ఏమిటో చూపిన కమ్యూనిస్టు. లేబర్​ కోసం పోరాడిన సీపీఐ సీనియర్​ లీడర్​. మాస్​తోపాటు క్లాస్​ కోసమూ కొట్లాడిన కామ్రేడ్​. పదునైన ప్రసంగాలకు పేరొందిన పార్లమెంటేరియన్​. ఆలిండియా ట్రేడ్​ యూనియన్​ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)​కి దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన జనరల్​ సెక్రెటరీ.  యూపీఏ–1 సర్కార్​ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాయకుడు .

గురుదాస్​ దాస్​గుప్తా పేరు విన్న వెంటనే చలికాలంలో ఫుల్​ హ్యాండ్స్​ రెడ్​ కలర్​ స్వెట్టర్​ వేసుకునే ఒక వ్యక్తి రూపం గుర్తొస్తుంది. అది ఆయన ‘ట్రేడ్​’మార్క్ డ్రెస్​. ఆలిండియా ట్రేడ్​ యూనియన్​ కాంగ్రెస్​ (ఏఐటీయూసీ)కి కేరాఫ్​ అడ్రస్​. సీపీఐ కార్మిక విభాగమైన ఏఐటీయూసీ పగ్గాలను 2001లో చేపట్టారు. యూనియన్​ని దేశంలోని మేజర్​ ట్రేడ్​ యూనియన్లలో ఒకటిగా మలిచారు. టాకింగ్​ పవరే ఆయన్ని లేబర్​ మర్చిపోని లీడర్​ స్థాయికి తెచ్చింది.

1936 నవంబర్​ 3న ప్రస్తుతం బంగ్లాదేశ్​లో ఉన్న బరిషల్​ జిల్లాలో పుట్టారు.  దేశ విభజన తర్వాత దాస్​గుప్తా ఫ్యామిలీ పశ్చిమ బెంగాల్​కి వచ్చి స్థిరపడింది. నలుగుర్నీ ఆకట్టుకునేలా, ఆలోచింపజేసేలా మాట్లాడడం  చిన్నతనంలోనే అబ్బింది. చదువుకునే వయసులోనే పాలిటిక్స్​కి ఫిక్స్​ అయిపోయి,  1950, 60 దశకాల్లో స్టూడెంట్​ లీడర్​గా గుర్తింపు తెచ్చుకున్నారు.

పేరెంట్​ పార్టీకే ఓటు

1950ల చివరలో ‘అన్​డివైడెడ్ బెంగాల్​ ప్రొవెన్షియల్​ స్టూడెంట్స్​ ఫెడరేషన్​’కి ప్రెసిడెంట్​గా, జనరల్​ సెక్రెటరీగా పనిచేశారు. ప్రభుత్వం కన్నెర్రకు గురై ఎన్నోసార్లు అండర్​​గ్రౌండ్​లోకి వెళ్లారు. కాస్త పరిస్థితి సద్దుమణిగాక బయటికొచ్చి మళ్లీ యాక్టివ్​గా ఉద్యమాల్లో పాల్గొనేవారు. 1964లో సీపీఐ నుంచి మార్క్సిస్టులు చీలిపోయి సీపీఎంగా కొత్త పార్టీ ఏర్పరచుకున్నారు. దాస్​గుప్తా మాత్రం పేరెంట్​ పార్టీలోనే ఉండాలనుకున్నారు.

తర్వాత 1970 ఆరంభంలో సీపీఐలోని లేబర్​ వింగ్​కి షిఫ్ట్​ అయ్యారు. ఆర్గనైజ్డ్​, అనార్గనైజ్డ్​ సెక్టార్లలోని కార్మికుల ప్రయోజనాల కోసం శ్రమించారు. అదే క్రమంలో తొలిసారిగా 1985లో రాజ్యసభకు ఎన్నికై, తర్వాత వరుసగా మరో రెండుసార్లు పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించారు. 2004లో పన్స్​కురా సెగ్మెంట్​​లో, 2009లో ఘటల్​ నియోజకవర్గంలో లోక్​సభ ఎంపీగా గెలిచారు. సుమారు పాతికేళ్లపాటు పార్లమెంటేరియన్​గా పనిచేశారు. మాస్​ పీపుల్​​తోపాటు ​వర్కింగ్​ క్లాస్​ కోసం కూడా పార్లమెంట్​ లోపల, బయట కొట్లాడి ప్రశంసలు పొందారు.

లంగ్​ కేన్సర్​తో..

గురుదాస్​ దాస్​గుప్తాది చాలా నిరాడంబర జీవితం. సింపుల్​ లైఫ్​ స్టయిల్​కి పెట్టింది పేరు. ఆరోగ్యం సహకరించకపోవటంతో 2014 జనరల్​ ఎలక్షన్​లో పోటీ నుంచి స్వయంగా తప్పుకున్నారు.   లంగ్​ కేన్సర్​ సోకడంతో కొన్ని నెలలుగా బాధపడిన గురుదాస్​ దాస్​గుప్తా (83) గురువారం ఉదయం చివరి శ్వాస విడిచారు.

ఒక వైపు ‘బోఫోర్స్’.. మరో వైపు యూపీఏ–1 సర్కార్

ట్రేడ్​ యూనియన్​ మూమెంట్స్​లో దాస్​గుప్తా తిరుగులేని నేతగా నిలిచారు. కేపిటలిజం, కరప్షన్​లపై రాజీలేని పోరాటం చేశారు. రాజీవ్​ గాంధీ హయాంలో వెలుగు చూసిన బోఫోర్స్​ స్కామ్​లో​ కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారు. డీల్​​లోని అవకతవకలను హైలైట్​ చేసి ఆ పార్టీ బండారాన్ని బయటపెట్టారు. దాస్​​గుప్తా కరుడు గట్టిన కమ్యూనిస్ట్​ అయినా అన్ని పార్టీల లీడర్లతో మంచి సంబంధాలుండేవి. 2004లో సీపీఐ జనరల్​ సెక్రెటరీ​ ఏబీ బర్దన్​తో కలిసి కాంగ్రెస్​కి సపోర్ట్​ ఇచ్చారు. మన్మోహన్​ సింగ్​ ప్రధానిగా యూపీఏ–1 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు దాస్​గుప్తా. పొలిటికల్​గా, ఐడియలాజికల్​గా బీజేపీకి, కామ్రేడ్స్​కి ఎప్పుడూ దూరమే. అయినా ఈ వెటరన్​ లీడర్​.. బీజేపీ అగ్రనేత, మాజీ ప్రధాని వాజ్​పేయితో మంచి సంబంధాలు మెయిన్​టైన్​ చేసేవారు. గ్రాండ్​ ఓల్డ్​ పార్టీ కాంగ్రెస్​లోని ఒక వర్గం నాయకులతోపాటు టీఎంసీ చీఫ్​, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతోనూ అరమరికలు లేకుండా కలిసిపోయేవారు. 2జీ స్పెక్ట్రం స్కాండల్​పై విచారణకు ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన జాయింట్​ పార్లమెంటరీ కమిటీలో సభ్యుడిగా తన ఒపీనియన్​ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పి ఆకట్టుకున్నారు.