ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆర్ట్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. ఇటీవల జిమ్‌లో కసరత్తు చేస్తున్న బిజినెస్ టైకూన్స్ ఐఏ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేశాయి. టాలీవుడ్, బాలీవుడ్ పాపులర్ నటులను ఏఐ ఫోటోలు హాట్ టాపిక్‌గా నిలిచాయి. ప్రభాస్, మహేష్‌బాబు, అల్లు అర్జున్ మొదలు షారూక్ ఖాన్, రణబీర్‌కపూర్ వరకు ఏఐ ఫోటోలు సంచలనంగా మారాయి. ఈ సూపర్ ప్టార్లంతా వృద్ధులుగా ఏలా కనిపిస్తారో చూపిస్తోంది. ముడతలు పడిన తమ హీరోల ముఖాలు చూసి కొంతమంది ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నప్పటికీ... మరికొంతమంది మాత్రం టెక్నాలజీ మహిమ మామా అంటూ చెబుతున్నారు.
ఆర్టిఫిషియల్ ఇమేజెస్ హవా మామూలుగా లేదు. ఏఐ ద్వారా ఇప్పటికే సినిమా, క్రీడారంగానికి చెందిన సెలబ్రిటీల ఫోటోలను వివిధ రకాలుగా చిత్రీకరిస్తున్నారు. తాజాగా రాజకీయ నాయకులు, వివిధ హోదాల్లో మంచి పేరు ప్రఖ్యాతాలు పొందిన ప్రముఖులు... కండలు తిరిగిన శరీరాకృతిని కలిగి ఉంటే ఎలా ఉంటుందో చూపించారు. ఒక ఫోటోలో మహాత్మాగాంధీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తే ఎలా ఉంటోందో చిత్రీకరించారు. గాంధీజీ కండలు తిరిగిన దేహాంతో ఉన్నారు.
ఇది వరకూ మనం ఎప్పుడూ చూడని నెల్సన్ మండేలాను చూడొచ్చు. కండలు తిరిగిన నాయకుడులా నెల్సన్ మండేలాను చిత్రీకరించారు.
ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI).. సాంకేతిక రంగంలో ఒక విప్లవాత్మక మార్పు. ఇవాళ టెక్ రంగంలో విపరీతంగా వినిపిస్తున్న పదం ఇదే. ChatGPTకి ముందు.. ఆ తర్వాత అనే స్థాయిలో మనిషి జీవితంపై AI ప్రభావం చూపుతోంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. AI క్రియేట్ చేసే ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మిడ్‌జర్నీ వంటి యాప్స్ ఉపయోగిస్తూ కొన్ని క్రియేటివ్ ఇమేజెస్ నెట్టింట సందడి చేస్తున్నాయి. ఈ యాప్స్‌ను వాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆర్టిస్టులు ఆసక్తికరమైన ఇమేజ్‌లను సృష్టిస్తున్నారు.