టెక్నాలజీలో ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే హవా. ఇంటర్నెట్, డిజిటల్ వాయిస్ అసిస్టెంట్స్, నెట్ ఫ్లిక్స్…ఒక్కటేంటి ప్రతి దాంట్లోనూ … AI పాత్ర కీలకం. ఇప్పటికే అనేక ఉద్యోగాల్లో ఇది భాగమైంది. కృత్రిమ మేధస్సుతో లాభాలు ఎన్ని ఉన్నాయో…నష్టాలు కూడా అదేస్థాయిలో ఉన్నాయంటున్నారు నిపుణులు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్..ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పదం. రోజు రోజుకు కొత్త ఆవిష్కరణలకు వేదికగా మారుతోంది టెక్నాలజీ రంగం. అందులో భాగంగా పుట్టుకొచ్చిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వ్యాపార, వాణిజ్య రంగాల్లో ఇది కీలకంగా మారుతోంది
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్…అనేది ఒకరకమైన కంప్యూటర్ ప్రోగ్రామ్. మనం బయటి ప్రపంచాన్ని చూసి నేర్చుకుంటున్నట్టే …. అదే తరహాలో నేర్చుకుని ఆలోచించగలిగే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ అల్గారిథమ్. సాధారణంగా ఇప్పటివరకూ మనం కంప్యూటర్ కు ప్రోగ్రాం ఇస్తే దానికి..ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే తెలుసు. కానీ AI అలా కాదు. ఒక పనిని రిపీట్ గా చేస్తున్నప్పుడు..దాన్ని ఇంకా బెటర్ గా ఎలా చేయొచ్చో ఆలోచిస్తుంది. తప్పులుంటే సరిదిద్దుకుంటుంది. అయితే భవిష్యత్తులో ఏఐతో మనిషి జీవితంలో కలిగే మార్పులపై పరిశోధనలు చేస్తున్నారు సైంటిస్టులు
ప్రస్తుతం మనిషి జీవితంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భాగమైంది. సాధారణంగా మనం ఫోన్ లో ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు…ఆ వర్డ్ ని ముందే సజెస్ట్ చేస్తుంది. మన ఇన్ బాక్స్ కు వచ్చే మెయిల్స్ లో ఏది స్వామ్ కి చెందినదో… అర్థం చేసుకునేలా సపరేట్ చేసేది కూడా ఏఐనే. ఏదైనా వస్తువు గురించి గానీ, టాపిక్ గురించి గానీ సెర్చ్ చేసే సమయంలో దానికి సంబంధించిన యాడ్ లు మాత్రమే డిస్ ప్లే అవుతుంటాయి. అంటే మన ఆలోచన, ఆసక్తిని బట్టి మనకు కావాల్సిన డేటాని అందిస్తుంది.
మన బ్రెయిన్ మాదిరిగానే ఏఐ కూడా పని చేస్తుంది. మన బ్రెయిన్ లో ఒక్కొక్క న్యూరాన్..కొన్ని వందల న్యూరాన్ లతో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఏఐ కూడా న్యూరాన్ నెట్ వర్క్ పద్ధతిలోనే ప్రపంచంలో మొత్తం నెట్ వర్క్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. మనం చుట్టుపక్కల విషయాలను గమనిస్తూ ఎలా నేర్చుకుంటామో ఏఐ కూడా అంతే..దానికి అందిన సమాచారాన్ని బట్టి కొత్త విషయాలు నేర్చుకుంటుంది. అంతే కాదు దానికదే ప్రోగ్రామింగ్ ను మార్చుకుంటుంది. ఇలా మనిషి సాయం లేకుండానే నిరంతరం స్వయంగా నేర్చుకుంటూ..ఏఐ తన మేధస్సును పెంచుకుంటోంది.
కృత్రిమ మేధ……..మనిషి జీవితంలో భాగమైంది. భవిష్యత్తులో చాలా మార్పులకు కారణం కాబోతుంది. ఏఐతో ఎడ్యుకేషన్, మెడికల్, వ్యవసాయం, నిఘా, రక్షణ రంగాల్లో అనేక మార్పులు రానున్నాయి. దీంతో సాఫ్ట్ వేర్ రంగానికి దీటుగా ఏఐ ఉండబోతోంది. ఇప్పటికే ఏఐ నిపుణులకి లక్షల్లో ప్యాకేజీలందిస్తున్నాయి కంపెనీలు. పెరుగుతున్న టెక్నాలజీతో ఎన్ని లాభాలున్నాయో..అంతే నష్టాలున్నాయంటున్నారు నిపుణులు. అకౌంట్స్, మెయిల్స్ హ్యాకింగ్, ఫోన్ ట్యాపింగ్ లాంటి సైబర్ క్రైమ్ నేరాలు దీనివల్లే పెరుగుతున్నాయని చెప్తున్నారు. వీటిని అరికట్టేందుకు పోలీస్, రక్షణ రంగాలు కూడా ప్రత్యేక టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఇక ఇప్పటికే చాలా విద్యాసంస్థలు ఏఐని కోర్సుగా అందిస్తున్నాయి. ఐఐటీ-హైదరాబాద్ బీటెక్ పూర్తిస్థాయి కోర్సుని ప్రవేశపెట్టింది. జేఈఈ-అడ్వాన్స్ డ్ ద్వారా ఏటా 20 మంది ఈ కోర్సులో చేరే అవకాశం కల్పిస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, లిబరల్ ఆర్ట్స్ సంయుక్తంగా…ఏఐ-హ్యుమానిటీస్ కోర్సును తీసుకొచ్చాయి. దీంతో పాటు ఐఐటీ కాన్పూర్ 6 నెలలు, ఏడాది పాటు సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించింది. థియరీ కంటే ప్రాక్టికల్స్ తోనే నేర్పిస్తామంటున్నారు…
భవిష్యత్ లో యుద్ధం వస్తే అది..సైబర్ యుద్ధమే అంటున్నారు ప్రోఫెసర్లు, సైంటిస్టులు. అందుకే వివిధ దేశాల్లోని యూనివర్శిటీలలో కొత్తగా ఏఐ, రోబోటిక్స్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. 2020 మార్చిలో సౌది ఆరేబియా వేదికగా ఏఐ సమ్మిట్ జరగనుంది.