AI తో వ్యవసాయం... సాగురంగంలో కొత్తపుంతలు

AI తో  వ్యవసాయం... సాగురంగంలో కొత్తపుంతలు

రోజు రోజుకు సాగురంగం కొత్తపుంతలు తొక్కుతుంది. ప్రతి పరిశ్రమలో వినూత్న ఆలోచనలకు అవకాశాలున్నాయి. ప్రపంచంలో వ్యవసాయ సాంకేతికతలో వేగవంతమైన పురోగతిని సాధిస్తున్నాయి. దీనికి తోడు కృతిమ మేథాశక్తి కూడా సాగుకు దగ్గరవుతుడటంతో సాగులో విప్లవాత్మకంగా మార్పులు కనబడుతున్నాయి.ఈ ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ని పరిచయంతో అనేక సాగు సవాళ్లను పరిష్కరిస్తుందని, అలాగే సాంప్రదాయ వ్యవసాయం యొక్క అనేక ప్రతికూలతలను తగ్గించడంలో సహాయపడుతుందని  వ్యవసాయ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఖర్చు ఆదా ..

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా వ్యవసాయ దిగుబడిని మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. AI తో కలిపి, ఖచ్చితమైన వ్యవసాయం రైతులు తక్కువ వనరులతో ఎక్కువ పంటలు పండిరచడంలో సహాయపడుతుంది. వ్యవసాయంలో AI ఉత్తమ నేల నిర్వహణ పద్ధతులు, సాంకేతికత మరియు అత్యంత ప్రభావవంతమైన డేటా నిర్వహణ పద్ధతులను అవలంభిస్తూ దిగుబడిని పెంచడంతోపాటు ఖర్చును తగ్గిస్తుంది.

సాగురంగంలో ఆటోమేషన్‌ ప్రభావం

వ్యవసాయ పనులు కష్టతరమైనవి.. .ప్రస్తుత రోజుల్లో  వ్యవసాయ కూలీ పనులు చేసే వారు లభించడం చాలా కష్టంగా మారింది.  ఆటోమేషన్‌ ఎక్కువ మంది వ్యక్తులను నియమించాల్సిన అవసరం లేకుండా ఒక పరిష్కారాన్ని అందిస్తుంది. డిజిటల్‌ ఆటోమేషన్‌ సాగు రంగంలో కూలీల కొరత లేకుండా చేస్తుంది.

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ డేటా ఆధారంతో వ్యవసాయంలో ప్రణాళికలు

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత ప్రిడిక్టివ్‌ అనలిటిక్స్‌ ..  వ్యవసాయ ఆధారిత వ్యాపారులకు మార్గాలను సుగమం చేస్తోంది. కృతిమ మేథా (AI) శక్తితో తక్కువ సమయంలో ఎక్కువ  ప్రాసెస్‌ చేయడంతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ధరలను అంచనా వేస్తుంది. ఖచ్చితమైన వ్యవసాయ ఉత్పత్తులు రైతులకు అందేలా చేస్తుంది. విత్తనం నాటే  దగ్గర నుంచి కోతకు వచ్చే సరైన సమయాలను నిర్ణయించి సలహాలు అందిస్తూ ఎప్పటికప్పుడు రైతులను హెచ్చరిస్తుంది.

 వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించడానికి మరియు ఎరువులు మరియు పురుగు మందుల మోతాదులను సిఫార్సు చేయడంలో ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ డే సహాయపడుతుంది. నీటిపారుదల, పంటకోత సమయం, పురుగు మందులు, పంటలో చికిత్స .. అవసరమయ్యే ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుంది. వనరుల వినియోగాన్ని  తగ్గించడంతోపాటు వినూత్న వ్యవసాయ పద్ధతులు, హెర్బిసైడ్ల వాడకం తగ్గడం, మెరుగైన పంట నాణ్యతో గణనీయమైన ఖర్చు ఆదా చేస్తూ అధిక లాభాలకై కృషి చేస్తుంది.

సాగు నుండి కోత వరకు ఉపయోగిస్తున్న AI విధానాలు

ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ ప్రణాళిలకను అమలు చేయడం వల్ల అనేక ప్రయోజనాలను ఉన్నాయి. ఇప్పటికే డెవలప్‌ చేసిన పోగ్రామ్‌ లను అమలు చేయడం వల్ల వ్యవసాయ రంగంలో అనేక పనులను సులభతరం చేస్తుంది. సాగులో AI ద్వారా చేసేసాగులో ఉత్తమ విధానాలను నిర్ణయించడం అలాగే ప్రారంభించడం ద్వారా పెద్ద డేటాను సేకరించి, ప్రాసెస్‌ చేయగలదు.

కలుపు తీయుటం ...  పంటకోయడం

మెషిన్‌ లెర్నింగ్‌ ద్వారా సాగుచేసిన పంటల్లో కలుపు మొక్కలను గుర్తించి వేరు చేయడానికి ఆకుల పరిమాణం, ఆకారం మరియు రంగును కంప్యూటర్‌ విజన్‌ విశ్లేషించి, కలుపు తీయడం వంటి రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌  పనులకు రోబోట్‌ లకు ప్రోగ్రామ్‌ చేయబడుతుంది. రోబోట్‌ ఇప్పటికే సమర్థవంతంగా ఉపయోగించబడుతుంది.

వాతావరణ పరిస్థితులను పర్యవేక్షించే AI (ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌) సెన్సార్‌లతో కలిపితే, పంటలకు ఎంత సమయంలో ఎంత స్థాయిలో నీటిని అందించాలో నిర్ణయించగలవు. ఒక స్వయంప్రతిపత్త పంట నీటిపారుదల వ్యవస్థ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ నీటిని సంరక్షించడానికి రూపొందించబడిరది. AI అల్గోరిథం ద్వారా డేటాను విశ్లేషించి, లీక్‌లను త్వరితగతిన గుర్తించడంతో చాలా వరకు నీటి నష్టాలను తగ్గించేలా చేస్తుంది. నీటి ప్రవాహం లేదా పీడనంలో మార్పులు వంటి లీక్‌ల యొక్క నిర్దిష్ట సంతకాలను గుర్తించడానికి మెషిన్‌ లెర్నింగ్‌ నమూనాలు అందిస్తుంది. AI అధిక నీటి వినియోగం ఉన్న ప్రాంతాలను గుర్తించడానికి పంట నీటి అవసరాలతో పాటు వాతావరణ డేటాను కూడా పొందుపరుస్తుంది. లీక్‌ డిటెక్షన్‌ను ఆటోమేట్‌ చేయడం ద్వారా మరియు హెచ్చరికలను అందించడం ద్వారా, AI సాంకేతికత నీటి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైతులకు వనరులను సంరక్షించడంలో సహాయపడుతుంది.

పంట మరియు నేల పర్యవేక్షణలో ఆర్టిఫిషల్‌ ఇంటలిజెన్స్‌ పాత్ర

మితిమిరినా ఎరువుల వినియోగం నేల, పంటకే కాదు తినే ప్రజలకు హాని. నేల మరియు సాగుచేసే పంటలకు ఇలాంటి అసమాతలను AI పరిజ్జానంతో పోషకాలను గుర్తించి దిగుబడుపై వాటి ప్రభావాలను నిర్ణయించి,తద్వారా రైతులు అవసరమైన సర్దుబాట్లను సులభంగా చేయడానికి అనుమతిస్తుంది. ఆర్టిఫిషియల్‌ న్యూరల్‌ నెట్‌వర్క్‌లు .. సపోర్ట్‌ వెక్టర్‌ మెషీన్స్‌ ..మోడల్‌లు మట్టి నాణ్యతను అంచనా వేస్తాయి.  కంప్యూటర్‌ విజన్‌ మోడల్స్‌ ఖచ్చితమైన డేటాను సేకరించడానికి నేల పరిస్థితులను పర్యవేక్షించగలవు. 

AI ద్వారా సాగులో వ్యాధులు మరియు తెగుళ్ళను గుర్తించడం

నేల నాణ్యత ... పంట పెరుగుదలను కంప్యూటర్‌ దృష్టితో తెగుళ్లు .. ఇతర వ్యాధుల ఉనికిని గుర్తించగలదు. తెగుళ్లు, వ్యాధులు, వైరస్‌ లు వంటి పంట ఆరోగ్యానికి ముప్పు కల్గించే వాటిని కనుగొనడానికి చిత్రాలను స్కాన్‌ చేయడానికి AI ని ఉపయోగిస్తాము. గర్తించడమే కాక వాటి నిర్మూలించడానికి లేదా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి రైతులకు సహాయపడుతుంది. 

ఎరువులు పురుగుమందుల చల్లేందుకు మేథాశక్తి సహాయం

 పురుగు మందులు, ఎరువులను చల్లేందుకు, నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడంలో సాయమందిస్తుంది. AI...  డ్రోన్‌లు కంప్యూటర్‌ విజన్‌ని ఉపయోగించి ఒక్కో ప్రాంతంలో ఎంత పురుగుమందును, ద్రవరూప ఎరువులను పిచికారీ చేయాలో సూచిస్తుంది.

గ్రేడింగ్‌ ప్రాసెస్‌ చేయడం

దిగుబడులు సాధించిన తర్వాత మార్కెట్లో అధిక ధరలు రావాలంటే మంచి నాణ్యత గలవిగ్రేడింగ్‌చేయాల్సిందే. కానీ ఇది సార్టింగ్‌ మరియు గ్రేడింగ్‌ ప్రక్రియలు సమయం మరియు ఖర్చుతో కూడినవి. అయితే AI ద్వారా ఈ పక్రియ మరింత ఖచ్చితంగా చేయగలదు. కంప్యూటర్‌ విజన్‌ ద్వారా ఆకారం, పరిమాణం మరియు రంగు ఆధారంగా పంట ఉత్పత్తులను గ్రేడ్‌ చేయగలదు. ఇది రైతుల ఉత్పత్తులను గ్రేడ్‌ ల వారిగా విభజించడానికి వీలు కల్పిస్తుంది.


 2050 నాటికి ప్రపంచ జనాభా పెరుగుదల 10 బిలియన్లకు చేరుతుందని అందరి అంచనా. ఐక్యరాజ్యసమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ  ప్రకారం, 2050 నాటికి ఆహారం కోసం వచ్చే డిమాండ్‌ను తీర్చడానికి పంట దిగుబడి 60% పెరగాలి. అయితే పెరుగుతున్న జనాభాకి సరిపడా పంట ఉత్పత్తిని పెంచడానికి మరియు దిగుబడిని పెంచడానికి వ్యవసాయ రంగంపై గణనీయమైన ఒత్తిడిని కలిగిస్తోంది. రానున్న రొజుల్లో పొంచి ఉన్న ఆహార కొరతను పరిష్కరించడానికి, రెండు విధానాలే కనిపిస్తున్నాయి. అందులో ఒకటి భూ వినియోగాన్ని విస్తరించడం మరియు పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని చేసేలా ప్రొత్సహించడం ఇక రెండోది వినూత్న పద్ధతులను స్వీకరించడం మరియు ఇప్పటికే ఉన్న వ్యవసాయ భూములలో ఉత్పాదకతను పెంచడానికి సాంకేతిక పురోగతిని పెంచి, ఉపయోగించేలా చేయడం. ఈ రెండు కార్యక్రమాలు క్షేత్రస్థాయి రైతాంగానికి చేరితేనే రానున్న రొజుల్లో ప్రజానికానికి ఆహార కొరతను అందించగలం.

ప్రతి సీజన్‌లో పంట సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి మరియు పంటపై పెట్టుబడి పెట్టడానికి రూపొందించిన కొత్త సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇదేకాక వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు శక్తిని ఉపయోగించి, సాగు పద్ధతులు, విన్నూత యంత్రాలు, సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇలాంటి కృతిమ మేథాశక్తి కూడా సన్న, చిన్నకారు రైతులకు చేరాలి. అప్పుడే సాగు బాగుగా, అందరికి కడుపునిండా ఆహారం అందుతుంది.