– దేశంలోనే తొలిసారి ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ కోర్సు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. మానవ మేధస్సును ఉన్నదున్నట్లు గా ఆవిష్కరిం చే నయా ఇంజినీరింగ్. భవిష్యత్తు ను శాసించాలంటే ఇంజినీరిం గ్ లో చేరే విద్యార్థులు ఎంచుకోవాల్సిన అసలు సిసలైన అడ్వాన్స్ డ్ కోర్సు ఇదే. ఇప్పటికే ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్లు కావాలంటూ కాలేజీలకు క్యూ కడుతున్నాయి.
ఐఐటీ, ఎన్ ఐటీల్లో ఇప్పటివరకు ఒక సబ్జెక్టుగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు నా లుగేళ్ల కోర్సుగా అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ ఐఐటీలో అడ్మిషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఐఐటీ తో పాటు రాష్ట్రంలోని ఉస్మానియా, జేఎన్ టీయూ పరిధిలో ఏడు కాలేజీల్లో ఏఐతో పాటు మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ , డేటా సైన్స్ కొత్త కోర్సులకు ఏఐసీటీఈ అనుమతించింది.
మన దేశంలో కేవలం 2.5 శాతం మంది మాత్రమే ఏఐ నిపుణులున్నట్లు నేషనల్ ఎంప్లాయబిలిటీ సర్వే తేల్చింది. అలాగే 2025 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ విలువ దాదాపు 90 బిలియన్ డాలర్లకు చేరుకుంటుం దని అంచనా. ఏఐపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారిం చి ఈ ఏడాది జూన్‌లో “నేషనల్ స్ట్రా టజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” పేరుతో రిపోర్టును తయారు చేసింది. ఇందులో ఏఐ నిపుణుల అవసరాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నిపుణులను తయారు చేయాలంటే కొత్త కోర్సు లు ప్రవేశపెట్టాలని ఏఐసీటీఈ నిర్ణయించిం ది. దీంతో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ కు అనుబంధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్ వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు అనుమతులిచ్చింది.
మన ఐఐటీలోనే ఫస్ట్
ఇప్పటివరకు బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో భాగంగానే ఏఐ, రోబోటిక్స్ , మెషిన్ లెర్నింగ్ కోర్సు లను అందిస్తున్నారు. 2019 జనవరి 17న ఇండియన్ ఇన్‌స్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు ను నాలుగేళ్ల బీటెక్ ప్రోగ్రాంగా ప్రవేశపెట్టిం ది. దీంతో దేశంలో ఏఐ బీటెక్ కోర్సును ప్రవేశపెట్టిన తొలి ఇన్ స్ టిట్యూట్ గా , అంతర్జా తీయంగా మూడో ఇన్స్ టిట్యూట్‌గా గుర్తిం పు పొందిం ది. ప్రస్తుతం ఎంఐటీ (యూఎస్), కార్నెగీ మిలన్ వర్శిటీ(యూఎస్)లే బీటెక్ (ఏఐ) కోర్సును అందిస్తున్నాయి . అలాగే ఐఐఐటీ-హైదరాబాద్ ఫౌండేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఎంటెక్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్నాయి .
కరిక్యులమ్
థియరీ, ప్రాక్టికల్ ఆధారంగా సాగే ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రడక్షన్ , రోబోటిక్స్ , బిగ్ డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డేటా సైన్స్, ఇంటెలిజెం ట్ ఏజెం ట్స్ , సెర్చ్ అల్గా రిథమ్స్ , అడ్వర్సియల్ సెర్చ్ గేమ్స్ , మెషిన్ లెర్నింగ్ బేసిక్ కాన్సెప్స్ట్ , లీనియర్ మోడల్స్ , పర్ సెప్ర్టా న్, అడ్వాన్స్ డ్ మోడల్స్ , న్యూరల్ నెట్ వర్క్స్ , డెసిషన్ ట్రీస్ , ఎస్ వీఎమ్ మార్కోవ్ డెసిషన్ ప్రాసెసింగ్ , లాజికల్ ఏజెం ట్ , ప్రపోర్షనల్ అండ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్ , ఏఐ అప్లికేషన్స్ , రోబోటిక్స్ వంటి టాపిక్ లు కోర్ సిలబస్ లో అధ్యయనం చేస్తారు.
టాప్ కంపెనీల్లో చోటు
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూ నికేషన్ టెక్నాలజీని ఉపయోగించి మానవుడిలా స్పందిం చే మెషిన్స్, కంప్యూటర్ సిస్టమ్స్ ను తయారు చేయడం ఏఐ నిపుణులు చేసే పని. సెల్ఫ్ డ్రైవిం గ్ కార్లు, ఫేస్ రికగ్నిషన్ , వెబ్ సెర్చ్, ఇండస్ర్టియల్ రోబోట్స్, మిసైల్ గైడెన్స్ , ట్యూమర్ డిటెక్టర్స్ , క్యాష్ డిపాజిట్ మెషిన్స్ వంటివి కృత్రిమ మేధను ఉపయోగించి తయారు చేసినవే. అలాగే బిగ్ డేటాను అనలైజ్ చేసి దానిని ఇంప్రూవ్ చేయడంతో పాటు తగిన పరిష్కారం చూపడంలో ఏఐ నిపుణులు ప్రధాన పాత్ర పోషిస్తారు. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, యాహు, ఫేస్ క్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలు చేస్తున్న టాప్ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
యావరేజ్ ప్యాకేజీ 14.3 లక్షలు
ఏఐ నిపుణుల సగటు వార్షిక వేతనం 14.3 లక్షలుగా అంచనా వేశారు. ఈ విభాగంలో ప్రస్తుతం ఏఐ బిజినెస్ డెవలపర్ , ఏఐ టెక్నీషియన్, ఏఐ అనలిటిక్స్ ఎగ్జిక్యూ టివ్స్ , మెషిన్ టీమిం గ్ మేనేజర్, డేటా డిటెక్టివ్ వంటి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి . బీటెక్ చేసిన వారికి కనీసం 5 నుం చి 10 లక్షలు, ఎంటెక్ , ఇతర కోర్సులు చదివిన వారికి 25 లక్షలకు పైగా ప్యాకేజీలు లభిస్తున్నాయి.
స్కిల్స్ ఉంటేనే
అన్ని రంగాల్లో ఏఐ ప్రాధాన్యత విస్తరిస్తుం డంటో అకడమిక్ స్థాయిలోనే స్కి ల్స్ పెం చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బీటెక్ లో ఒక సబ్జెక్టు గా లేదా నాలుగేళ ్లఏఐ బీటెక్ తర్వాత ఎంటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పె షలైజేషన్ చేస్తే అధిక స్కి ల్స్ సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ , ఐబీఎం, ఇంటెల్ వంటి టాప్ కంపెనీలు ఆన్ లైన్ లో అందిస్తున్నషార్ట్టెర్మ్ కోర్సులు చేసి స్కి ల్స్ పెం చుకోవచ్చు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఐఏఐ) కూడా పలు షార్ట్‌టెర్మ్ కోర్సులను ఆఫర్ చేస్తోం ది. కోర్సు పూర్తయినవారు ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల ఇండస్ర్టీలోకి అడుగుపెట్టే మార్గం సుగమం అవుతుంది.
ఏఐ అంటే…
ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూ నికేషన్ టెక్నాలజీని ఉపయోగించి మానవుడిలా స్పందించే ఇంటెలిజెం ట్ మెషిన్స్, కంప్యూటర్ సిస్టమ్స్ ను తయారు చేసే టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అమెరికా శాస్త్రవేత్త జాన్ మెక్‌కార్తీ 1956లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పదాన్ని సృష్టించారు. మనుషులకు ప్రత్యామ్నాయంగా మెషిన్స్ ను తయారు చేయడమే దీని లక్ష్యం. ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడిప్పుడే ఏఐ పై పరిశోధనలు ముమ్మరం చేశాయి.
ఏఐ స్టాటిస్టిక్స్
జేఈఈ కౌన్సెలిం గ్ ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్ మెం ట్ లో ఐఐటీహెచ్ లో 21 మంది బీటెక్ ఏఐ కోర్సు ను ఎంపిక చేసుకోగా 39 మంది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరిం గ్ తీసుకున్నారు. మన దేశంలో ప్రస్తుతం 40 వేల మంది ఏఐ ప్రొఫెషనల్స్ మాత్రమే ఉన్నా రు. 2018 లో 3700 మంది కొత్త ఏఐ నిపుణులు తయారయ్యారు. 48శాతం మంది ఏఐ నిపుణులు పీజీ క్వాలిఫికేషన్ కలిగి ఉండగా 5 శాతం మంది పీహెచ్ డీ చేసినవారున్నారు. ఇండియాలో ఏఐ ప్రొఫెషనల్స్ ను రిక్రూట్ చేసుకుంటు న్న మొదటి పది కంపెనీలు యాక్సెం చర్ , టీసీఎస్ , కాగ్నిజెం ట్, ఇన్ఫోసిస్ , విప్రో, ఐబీఎం, మైక్రోసాఫ్ట్, అమెజాన్ , క్యాప్ జెమినీ, హెసీఎల్ టెక్నాలజీస్.
హైదరాబాద్ కు ఫస్ట్ రోబో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన ప్రపంచంలో ఫస్ట్ హ్యూమనాయిడ్ రోబో సోఫియా. ఇది 2018 ఫిబ్రవరిలో నాస్ కా మ్ నిర్వహించిన వార్షిక సదస్సులో ప్యానె లిస్ట్‌గా పాల్గొని ప్రసంగించింది. సోఫియాను హాంకాంగ్‌కి చెందిన హాన్సన్ రోబోటిక్స్ తయారుచేసింది. డేవిడ్ హాన్సన్ దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందిం చారు. కార్యక్రమంలో అడిగిన ప్రశ్నలకు సోఫియా మనుషుల లాగే సరైన సమాధానాలు చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
ఏఐ కోర్సులు అందిస్తున్న టాప్ ఇన్ స్టిట్యూట్ లు
ఐఐటీ, హైదరాబాద్ బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఐఐఐటీ, ఢిల్లీ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరిం గ్
ఐఐఐటీ, నయా రాయ్ పూ ర్ బీటెక్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
జీఎల్ ఐయూ బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్
జీహెచ్ రాయ్‌సోనీ కాలేజ్ బీటెక్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
శారదా యూనివర్శిటీ బీటెక్ సీఎస్ ఈ (ఆర్టిఫిషియల్ లెర్నింగ్ & మెషిన్ లెర్నింగ్ )
జైన్ యూనివర్శిటీ సీఎస్ టీ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ )
అమృత విశ్వ విద్యా పీఠం బీటెక్ సీఎస్ ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)
ఆమిటీ యూనివర్శిటీ ఇంటిగ్రేటెడ్ బీటెక్ +ఎంటెక్ (ఏఐ అండ్ రోబోటిక్స్ )
గ్లోబల్ ఆపర్చునిటీస్ ఎక్కువ
గూగుల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై పరిశోధనలకు భారీ పెట్టు బడులు పెడుతుండటంతో ఈ కోర్సుల్లో నైపుణ్యాలు సాధించిన వారికి గ్లోబల్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మెషిన్స్ , రోబోట్స్ వంటి ఇంటర్నెట్ థింగ్స్ సరిగా పనిచేసేందుకు అనువైన ప్రోగ్రామింగ్ రాయగలిగే మానవ మేధస్సు ఎంతో అవసరం. కాబట్టి రెగ్యులర్ బ్రాంచెస్ తో పోల్చుకుం టే అధిక అవకాశాలతో త్వరగా సెటిల్ అయ్యేం దుకు వీలు కల్పించే కోర్సులివి అని చెప్పవచ్చు. తగిన నైపుణ్యాలుం టేనే ఈ కోర్సుల్లో రాణిస్తా రనే విషయం గుర్తుంచు కోవాలి.
– ప్రొ.ఎన్ .వి. రమణా రావు, డైరెక్టర్ , ఎన్ ఐటీ, వరంగల్
-–వెలుగు ఎడ్యుకేషన్ డెస్క్