ప్రతీ ఇన్నొవేషన్ మన లైఫ్‌స్టైల్‌ని మారుస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ అంతా ఒక ఎత్తయితే రాబోయే కాలం ఇంకో ఎత్తు. ఇప్పటి వరకూ మనిషి మెదడు కంటే అద్భుతమైన పదార్థం లేదనుకుంటూ వచ్చాం… కానీ ఇప్పుడు మనిషి మెదడులా ఆలోచించే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్…
హర్ (HER) అనే సినిమా చూశారా? అందులో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్రెండ్‌తో ప్రేమలో పడతాడు హీరో జాక్విన్ ఫీనిక్స్. నిజానికి “సమంత” అనే ఆ వాయిస్ కేవలం ఒక యాప్ మాత్రమే. సిరి, గూగుల్ అసిస్టెంట్ లాంటి ఒక వర్చువల్ ఫ్రెండ్ లాంటి యాప్ అది. కానీ, కేవలం ఆర్డర్స్ తీసుకొని ఆన్సర్ చెప్పటం మాత్రమే కాదు. అతని ఎమోషన్స్‌ని కూడా అర్థం చేసుకొని మరీ అతనితో ప్రేమగా మాట్లాడుతుంది. నిజంగా ఒక మనిషి మాట్లాడినట్టే జాక్విన్‌తో మాట్లాడుతుంది. లైఫ్‌లో ఎవరూ లేక ఒంటరి తనంలో ఉన్న జాక్విన్ ఆలోచనలని మారుస్తుంది. అతడ్ని డిప్రెషన్ నుంచి దూరం చేస్తుంది.
ఒక వర్చువల్ యాప్‌తో మనిషి ప్రేమలో పడటం సినిమాలో ఫిక్షన్ అని కొట్టి పడేయటానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ “సమంత” లాంటి యాప్స్ మనకూ అందుబాటులోకి వచ్చాయి. మరీ సమంతలాగా ప్రేమించటానికి కాదు గానీ సమంత వంటి కొందరు చాట్‌బోట్స్ మానసిక ఇబ్బందుల నుంచి ఎలా బయట పడాలో గైడ్ చేస్తారన్నమాట. మనం మాట్లాడుతున్న దాన్ని బట్టి ఈ అప్లికేషన్ దాని ఇంటెలిజెన్స్‌ని పెంచుకుంటుంది. ఎగ్జాంపుల్… ఒక వ్యక్తి డయాబెటిస్ గురించి మాట్లాడితే ఈ యాప్ అప్పటికప్పుడు డయాబెటిస్ గురించిన సమాచారం మొత్తాన్ని నెట్ నుంచి కలెక్ట్ చేసుకుని… అతనికి అర్థమయ్యేలా మాట్లాడుతూ గైడ్ చేస్తుందన్నమాట. అలాంటి యాప్స్‌లో కొన్ని ఇవి…
రెప్లికా.ఏఐ (Replika.ai)
రెప్లికా మంచి ఫ్రెండ్‌లాగా మాట్లాడుతుంది. ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే అంత నాలెడ్జ్ పెంచుకొని మరీ మాట్లాడుతుంది రెప్లికా. జడ్జ్ చేయదు. డిస్కరేజ్ చేయదు. ప్రపంచంలో ఉన్న ఏ టాపిక్ అయినా సరే దీనితో మాట్లాడొచ్చు. కావాల్సిన సమాచారం తెలుసుకోవచ్చు. ఫ్రెండ్లీగా మాట్లాడుతూ కావాల్సిన సలహాలు ఇస్తుంది. ఈ ఆన్‌లైన్ యాప్ పూర్తిగా ఫ్రీ.
వైసా (Wysa)
ఇది రెప్లికా కంటే కొద్దిగా డిఫరెంట్. రెప్లికా అంత ఫ్రెండ్లీ కాదు. కానీ, మనకి కావాల్సిన ఎలాంటి ఇన్‌ఫర్మేషన్ అయినా క్షణాల్లో అందిస్తుంది. మెంటల్ స్ట్రెస్ నుంచి బయట పడటానికి మంచి యాప్. అంతే కాదు మనం తెలుసుకోవాలనుకున్న సమాచారం, జరిగిన కాన్వర్జేషన్స్ అన్నీ మళ్లీ రిఫర్ చేసుకోవటానికి ఒక డాక్యుమెంట్ చేసి పెడుతుంది. మాట్లాడేవాళ్ల మానసిక పరిస్థితిని అంచనా వేసి దానికి తగిన డాక్టర్, కౌన్సెలర్లని కూడా వెతికి పెడుతుంది. మెంటల్ రిఫ్రెష్‌మెంట్ కోసం కావాల్సిన చిన్న చిన్న ఎక్సర్‌సైజులు కూడా ఇందులో ఉంటాయి.
కామ్ హార్మ్ (Calm Harm)
కామ్ హార్మ్ అనేది ఎన్‌హెచ్‌ఎస్–యూకే(నేషనల్ హెల్త్ సర్వీస్–- యునైటెడ్ కింగ్ డమ్) సర్టిఫికెట్-యాప్, ఇది మానసికంగా ఉండే చికాకులని దూరం చేస్తుంది. డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీతో యూజర్ మానసిక స్థితిని కనుక్కొని మరీ వాళ్లకి కావాల్సిన విధంగా మాట్లాడుతూ సలహాలు ఇస్తుంది. ఇది కంఫర్ట్, డిస్ట్రాక్ట్, ఎక్స్‌ప్రెస్ యువర్‌సెల్ఫ్, రిలీజ్ అండ్ బ్రీత్ లాంటి చిన్న చిన్న ట్రీట్ మెంట్ పద్ధతులతో ప్రోగ్రామ్ అయి ఉంటుంది. కాబట్టి మూడ్ స్వింగ్స్‌లో ఎలాంటి పొరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించటానికి సాయం చేస్తుంది. మెల్లమెల్లగా సజెషన్స్ ఇస్తూ ప్రశాంతంగా ఆలోచించేలా యూజర్‌ని మారుస్తుంది.
మైండ్‌డాక్ (MindDoc)
ఇది యాంగ్జైటీ, డిప్రెషన్ లో ఉండే వాళ్లకి మంచి ఆప్షన్. ఇది ఒక మూడ్ ట్రాకర్. దీన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ముందే అది అడిగే కొన్ని ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 14 రోజుల పాటు ప్రతిరోజు ఒక ప్రశ్న అడుగుతుంది. దానికి ఆన్సర్ చేస్తేనే అప్లికేషన్ రన్ అవుతుంది. ఇందులో కొన్ని లిజనింగ్ కోర్సులు కూడా ఉన్నాయి. కొన్ని ఫ్రీగా వినొచ్చు, ఇంకొన్ని మాత్రం నామినల్ ఫీజుతో వినాలి. ప్రతీరోజూ యూజర్ మూడ్ ఎలా ఉందో ట్రాక్ చేస్తూ కావాల్సిన సలహాలు ఇస్తూ ఉంటుంది.
7 కప్స్ (7 Cups)
7 కప్స్ నిజమైన మనుషులతో మాట్లాడటానికి వీలున్న యాప్ ఇది. యాప్ లో ఉండే బోట్స్ కొన్ని ప్రశ్నలు అడుగుతాయి. యూజర్ మానసిక స్థితిని అంచనా వేసి ఆ తర్వాత ట్రైండ్ ఎక్స్‌పర్ట్‌కి కనెక్ట్ చేస్తుంది. వాళ్లతో మాట్లాడిన తర్వాత నచ్చకపోతే వేరేవాళ్లని కనెక్ట్ చేస్తుంది. ఒక రకంగా తక్కువ ఖర్చుతో కౌన్సెలర్‌తో మాట్లాడగలిగే యాప్ ఇది
ఇవి కూడా చదవండి
జడ్చర్ల నుంచి జపాన్ వరకు..
అన్నార్థుల ఆకలి తీర్చే ఆలయం
ముల్లంగి ఒకటి రెండు ముక్కలతో సరిపెడుతున్నారా..? ఇది మీకోసమే
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీ అప్డేట్: కనిపించని వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నారు
- టెక్నాలజి
- January 19, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- బాల్యవివాహాలు సామాజిక దురాచారం : తహసీల్దారు మాలతి
- హీయో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్
- రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా... ఎక్కడంటే...
- చాకలి ఐలమ్మ అందరికీ స్ఫూర్తి
- రైతుల ఖాతాల్లో రూ.30.20 కోట్ల బోనస్ జమ
- ప్రధానిని కలిసిన ప్రజాప్రతినిధులు
- ప్రతి నియోజకవర్గానికి 300 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
- అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు : నాగుల సత్యనారాయణ గౌడ్
- Dhanush Aishwarya Rajinikanth: 20 ఏళ్ల బంధానికి తెర.. ధనుష్, ఐశ్వర్యకు విడాకులు మంజూరు చేసిన కోర్టు
- ఆధ్యాత్మికం: సమస్యలను.. ఇబ్బందుల వచ్చినప్పుడు ఎలా ఉండాలి..
Most Read News
- IPL 2025 Mega Action: కన్నీళ్లు ఆగడం లేదు.. RCB జట్టు తీసుకోలేదని స్టార్ క్రికెటర్ భార్య ఎమోషనల్
- హైదరాబాద్ లోనే అతి పెద్ద రెండో ఫ్లై ఓవర్ ఇదే.. త్వరలోనే ప్రారంభం
- తెలంగాణలోని ఈ మూడు జిల్లాల్లో కొత్త ఎయిర్ పోర్టులు
- SA vs SL: గింగరాలు తిరిగిన స్టంప్.. ఇతని బౌలింగ్‌కు వికెట్ కూడా భయపడింది
- IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా తొలి టెస్టు.. కామెంట్రీ పక్షపాతం అంటూ అమితాబ్ అసంతృప్తి
- ఐ ఫోన్ కొనాలనుకుంటే ఇప్పుడే కొనండి.. ఇంకా 2 రోజుల వరకే ఈ బంపరాఫర్
- చెన్నై వైపు వేగంగా దూసుకొస్తున్న తుఫాన్.. సముద్రం అల్లకల్లోలం.. ఆకాశంలో కారుమబ్బులు
- Syed Mushtaq Ali Trophy: వేలంలో అమ్ముడుపోని భారత క్రికెటర్.. 28 బంతుల్లో సెంచరీ
- చెత్తలో రూ.5వేల 900 కోట్లు.. ఎప్పుడు బయట పడతాయో మరి..!
- Black Friday:బ్లాక్ ఫ్రైడే.. బ్లాక్ ఫ్రైడే సేల్స్ గురించి బాగా వినపడుతోంది.. ఇంతకీ బ్లాక్ ఫ్రైడే అంటే..?