ఏఐ వాడకం అనివార్యమైంది.

ఏఐ వాడకం అనివార్యమైంది.
  • సిడ్నీలో జరిగిన సీపీఏ కాన్ఫరెన్స్​లో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు: భారత్ తో పాటు కామన్వెల్త్ దేశాలలో ఏఐ వాడకం అనివార్యమైందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. పార్లమెంటరీ ప్రక్రియలో ఏఐ ప్రవేశించి కొద్ది కాలమే అయినా వేగంగా విస్తరిస్తుందని చెప్పారు. సిడ్నీలో జరుగుతున్న 67వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) కాన్ఫరెన్స్ లో బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొన్నారు. 

తెలంగాణ రాష్ట్ర శాసనసభ తరపున "పార్లమెంటరీ ప్రక్రియలో కృత్రిమ మేధస్సు ఉపయోగం- ఆచరణకు అవకాశాలు, సవాళ్లు" అనే అంశంపై ఆయన ప్రసంగించారు. భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల పార్లమెంట్లల్లో ఏఐను విస్తృతంగా ఉపయోగిస్తున్నారన్నారు. నేషనల్ ఇ -విధాన్ అప్లికేషన్ అమలుతో పార్లమెంట్ లో పేపర్ లెస్ ప్రక్రియ అమలు చేయడం జరుగుతుందన్నారు.