రాజన్నసిరిసిల్ల,వెలుగు: తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు 30 శాతం పీఆర్సీ ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు సిరిసిల్లలో మంగళవారం క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సాంస్కృతిక సంఘం సారథి కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎడ్మల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో రోజులుగా సాంస్కృతిక సారథి కళాకారులకు జీతాలు పెంచడం ఆనందంగా ఉందన్నారు.
హుజూరాబాద్, వెలుగు: తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులకు పీఆర్‌సీ పెంపుపై హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సీఎం, మంత్రుల ఫొటోలకు మంగళవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 583 మంది కళాకారులకు పీఆర్సీ పెంచి రూ. 24,514 ఉన్న జీతాన్ని రూ.31,868 పెంచడం హర్షనీయమన్నారు.