అరుకు టూ మహారాష్ట్ర, యూపీ.. హైదరాబాద్​లో 254 కిలోల గంజాయి సీజ్

అరుకు టూ మహారాష్ట్ర, యూపీ.. హైదరాబాద్​లో 254 కిలోల గంజాయి సీజ్
  • హైదరాబాద్‌‌‌‌ ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ మీదుగా తరలించేందుకు యత్నం
  • ఏడుగురు సభ్యుల యూపీ గ్యాంగ్‌‌‌‌లో ఐదుగురి అరెస్ట్

హైదరాబాద్‌‌‌‌,వెలుగు:  యూపీకి చెందిన ఏడుగురు గంజాయి ముఠాలో ఐదుగురిని సైబరాబాద్‌‌‌‌ ఎస్​వోటీ  పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేశారు. వీరి వద్ద రూ.88.90 లక్షల 254 కిలోల గంజాయి, రెండు కార్లు, కంట్రీమేడ్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న  ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. పోలీసులపై ఈ గ్యాంగ్‌‌‌‌ కాల్పులు జరిపిందని ప్రచారం జరగడంతో  సైబరాబాద్ పోలీసులు అలాంటిదేమి లేదని రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్  స్పష్టం చేశారు. 

రక్షణ కోసం కంట్రీమేడ్ రివాల్వర్‌‌‌‌   

యూపీలోని సుల్తాన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌ జిల్లాకు చెందిన ఠాకూర్‌‌‌‌‌‌‌‌ సచిన్ సింగ్‌‌‌‌(30) జాన్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ స్థానికంగా గంజాయి సప్లయర్లు. ఐదేండ్లుగా ఏపీలోని అరకు వ్యాలీ నుంచి మహారాష్ట్ర, యూపీకి  గాంజా రవాణా చేస్తుండగా.. 3 నెలల కింద వీరు  ఒడిశాకు చెందిన గంజాయి ఏజెంట్‌‌‌‌ రాజు వద్ద 270 కిలోలు కొన్నారు. యూపీకి తీసుకెళ్లి ప్రతాప్‌‌‌‌ఘర్‌‌‌‌‌‌‌‌కు చెందిన అమిత్‌‌‌‌ సింగ్‌‌‌‌కు అమ్మారు. ఆ తర్వాత  గన్స్ స్మగ్లింగ్ వ్యాపారి సునీల్ సింగ్‌‌‌‌ వద్ద ఠాకూర్ సింగ్‌‌‌‌ రూ.లక్షకు 0.32 ఎంఎం కంట్రీమేడ్  పిస్టల్,11  రౌండ్స్ బుల్లెట్స్‌‌‌‌ కొన్నాడు. 

నంబర్ ప్లేట్ మార్చుతూ..

సోమవారం అరకు నుంచి వస్తూ.. ఒక కారుకు  ఒడిశా నంబర్ ప్లేట్‌‌‌‌ అమర్చారు. మంగళవారం రాజేంద్రనగర్ ఓఆర్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ పైకి ఎక్కి  ఎగ్జిట్‌‌‌‌ 17 వద్ద సర్వీస్ రోడ్డులో మహారాష్ట్రకు తీసుకెళ్లే 100 కిలోల గంజాయిని మరో కారులోకి మార్చుతున్నారు.  అనుమానాస్పదంగా కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సైబరాబాద్ ఎస్‌‌‌‌వోటీ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లగా, ముఠాలోని వినోద్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌,రవీందర్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌ పారిపోయారు.  ఠాకూర్ సింగ్‌‌‌‌,మహ్మద్ నదీమ్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ సక్లైన్‌‌‌‌,మహ్మద్‌‌‌‌ సలీం,ప్రశాంత్‌‌‌‌ సింగ్‌‌‌‌ను పోలీసులు పట్టుకున్నారు. 

మరోచోట 2 కిలోల గంజాయి సీజ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: వినియోగదారులకు గంజాయి అమ్మడానికి సిద్ధమైన ఇద్దరిని పక్కా సమాచారంతో టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 2 కేజీల గంజాయి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మహమ్మద్ నసీర్, యూనస్ ఖాన్​గా గుర్తించారు. నసీర్​పై ఇప్పటికే 5 ఎన్డీపీఎస్, 03 ఆయుధ చట్టం, 10 ఆస్తి నేరాలు , ఒక పెట్టీ కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు జుబేర్ ఖాన్ , అబ్దుల్ ఖాదర్ జీలానీ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

గంజాయికి ఎస్కార్ట్​గా

అరకు నుంచి గంజాయిని తెచ్చేందుకు ఠాకూర్ సింగ్  ముంబైలో ఉండే యూపీ ప్రతాప్‌‌‌‌ఘర్‌‌‌‌‌‌‌‌కు చెందిన మహ్మద్ నదీమ్‌‌‌‌(21),మహ్మద్‌‌‌‌ సక్లైన్‌‌‌‌(24) మహ్మద్‌‌‌‌ సలీం(24) ప్రశాంత్‌‌‌‌ సింగ్‌‌‌‌(22)లను ఎస్కార్ట్‌‌‌‌గా నియమించుకున్నాడు. ఈ నెల 9న గంజాయిని అరకు నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసి ఎస్కార్ట్‌‌‌‌ కు  చెప్పగా..  ఎర్టిగా కారులో విజయవాడకు వెళ్లారు. అక్కడ సిద్ధంగా ఉన్న ఠాకూర్ సింగ్‌‌‌‌, వినోద్‌‌‌‌యాదవ్‌‌‌‌, రవీందర్ యాదవ్‌‌‌‌, ప్రశాంత్‌‌‌‌తో కలిసి ఈనెల7న అరకు వెళ్లారు.  ఏజెంట్‌‌‌‌ రాజు వద్ద 254 కిలోలు కొన్నారు. ఇందులో 150 కిలోలు యూపీలోని అమిత్‌‌‌‌ సింగ్‌‌‌‌కు మిగితాది ముంబైలోని పెడ్లర్లకు అందించేందుకు ప్లాన్ చేసి దొరికిపోయారు.