Virat Kohli: నెక్స్ట్ లెవల్లో కోహ్లీ క్రేజ్.. అభిమానులతో నిండిపోయిన అరుణ్ జైట్లీ స్టేడియం

Virat Kohli: నెక్స్ట్ లెవల్లో కోహ్లీ క్రేజ్.. అభిమానులతో నిండిపోయిన అరుణ్ జైట్లీ స్టేడియం

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో విరాట్ ఎక్కడ మ్యాచ్ ఆడినా అభిమానులు భారీ సంఖ్యలో వస్తారు. వరల్డ్ వైడ్ కోహ్లీకి ఉన్న క్రేజ్ అలాంటిది. సొంతగడ్డపై మ్యాచ్ ఆడితే  స్టేడియం నిండిపోవడం ఖాయం. ప్రస్తుతం అలాంటి సంఘటనే సిసిల మీడియాలో వైరల్ అవుతుంది. 12 ఏళ్ళ కోహ్లీ రంజీ ట్రోఫీలోకి బరిలోకి దిగాడు. గురువారం (జనవరి 30) రైల్వేస్ తో ప్రారంభమైన మ్యాచ్ ద్వారా కోహ్లీ దేశవాళీ క్రికెట్ లోకి గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చాడు.

కోహ్లీ కోసం ఈ మ్యాచ్ లో అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ అభిమాన స్టార్‌ను చూసేందుకు ఉదయం 4 గంటల నుండే అభిమానులు అరుణ్ జైట్లీ స్టేడియం వెలుపల క్యూ కట్టడం విశేషం. అరుణ్ జైట్లీ స్టేడియం మొత్తం కోహ్లీ ఫ్యాన్స్ తో నిండిపోవడం విశేషం.  భారత మాజీ కెప్టెన్ రంజీ ట్రోఫీలో 12 సంవత్సరాలకు తర్వాత ఢిల్లీ జెర్సీలో కనిపించడంతో అభిమానులు హంగామా చేశారు. విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ  సందర్భంగా ఢిల్లీ & డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) అభిమానులకు ఉచితంగా ప్రవేశం కల్పించింది.

Also Read : ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌‌‌‌ లో తిలక్‌‌‌‌ వర్మ @ 2

ప్రేక్షకులు స్టేడియంలోకి ప్రవేశించడానికి వారి ఆధార్ కార్డ్‌లను చూపితే చాలు. 'కోహ్లీ, కోహ్లీ' అనే నినాదంతో పాటు 'ఆర్‌సిబి, ఆర్‌సిబి'అనే నినాదాలు వినిపించాయి. కోహ్లీకి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్స్ కోసం ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ ఆయుష్‌ బదోనీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. అభిమానులకు రేపు కోహ్లీ బ్యాటింగ్ చూసే అవకాశం ఉంది. 

రైల్వేస్ తో మ్యాచ్ కు ఢిల్లీ జట్టు: 

అర్పిత్ రాణా, సనత్ సాంగ్వాన్, విరాట్ కోహ్లి, యశ్ ధుల్, ఆయుష్ బడోని(కెప్టెన్), ప్రణవ్ రాజువంశీ(వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, నవదీప్ సైనీ, మనీ గ్రేవాల్, సిద్ధాంత్ శర్మ