వికారాబాద్-కృష్ణాకు రైల్వే లైన్

వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు.  ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించుకున్నారు. 

గతంలో ప్రతిపాదించిన వికారాబాద్- కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైన ఈ మార్గాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. ఈ మార్గాన్ని పూర్తి చేస్తే పరిసర ప్రాంతాల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. సమీప ప్రాంతాల్లో పరిశ్రమలను నెలకొల్పేందుకు వీలుంటుందన్నారు. రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు.ఈ సమావేశంలో R&B,రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.