
బెల్లంపల్లి, వెలుగు: పెద్దపెల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన అరుణ్ వాల్మీకి వంశీకృష్ణపై పాట రూపొందించారు. హైదరాబాద్లోని ఎంపీ వంశీకృష్ణ ఇంటి వద్ద ఆయన చేతుల మీదుగా పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. తనపై ఉన్న అభిమానంతో అరుణ్ వాల్మీకి పాట రూపొందించడం గొప్ప విషయం అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి భూకాల రంజిత్ కుమార్, లీడర్లు పీక లక్ష్మణ్, సన్నీ యాదవ్, ఇజాజ్ పాషా, దూడపాక బలరాం, భోగి సాగర్, అంజద్ ఖాన్, గాదే అరుణ్ తదితరులు పాల్గొన్నారు.