గద్వాల, వెలుగు: నడిగడ్డలోని వాల్మీకీలు ఏకమై మీటింగ్ పెడితే, కేంద్ర మంత్రితో ఎస్టీ జాబితాలో చేర్పించడంపై స్పష్టమైన హామీ ఇప్పిస్తానని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ భరోసా ఇచ్చారు. శనివారం గద్వాలలో ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకి బోయలు ఆమెకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల కోసం నాటకాలు ఆడుతోందని విమర్శించారు.
గత ఏడాది వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని, ఇతర కులాలను కూడా కలపడంతో సాధ్యపడలేదన్నారు.
మరోసారి ఇలాగే తీర్మానం చేసి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ రామాంజనేయులు, వాల్మీకి బోయ సంఘం లీడర్లు రాములు, సద్దల రాములు, సవరన్న, గడ్డం రాముడు పాల్గొన్నారు.