నల్గొండ అర్బన్, వెలుగు : విద్యార్థులను చదువుతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు ప్రోత్సహించాలని టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ఐ ఆర్సీఓ అరుణకుమారి సూచించారు. సోమవారం స్థానిక జీవి గూడెం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జీవీ గూడెం గురుకుల ప్రిన్సిపాల్ లలితకుమారితో కలిసి సైన్స్ ఫెయిర్‌ను ప్రారంభించారు.
నల్గొండ జోనల్ లెవెల్ లోని 55 స్కూళ్ల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని చెప్పారు. అనంతరం విద్యార్థుల ఎగ్జిబిట్లను పరిశీలించారు. విద్యార్థులు ఇలాగే ప్రయోగాలపై ఆసక్తి చూపుతూ.. సైంటిస్టులుగా ఎదగాలని సూచించారు.