సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి)కి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇటానగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఖండూ సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ కేంద్ర మంత్రి నినాంగ్ ఎరింగ్, వాంగ్లిన్ లోవాంగ్‌డాంగ్ లు, ఎన్ సీపీ లీడర్లు ముచ్చు మితి, గోకర్ బాసర్ లు కాషాయ పార్టీలో చేరారు.
Warmly welcomed Hon Congress MLAs - Shri @ninong_erring Ji & Shri @WanglinLowangdong Ji; and 2 NPP MLAs; Shri @Mutchu4 Ji, former State President, NPP and Shri @GokarBasar Ji - in the @BJP4Arunachal.
— Pema Khandu པདྨ་མཁའ་འགྲོ་། (@PemaKhanduBJP) February 25, 2024
Their joining of party is a testament to their faith in the principles of good… pic.twitter.com/PvbyPNaNYB
ప్రధాని మోదీ నాయకత్వంలోని సుపరిపాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ బీజేపీలో చేరినట్లుగా వారు తెలిపారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ఇప్పుడు కాంగ్రెస్, ఎన్‌పీపీలకు ఇద్దరు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 53 మంది ఎమ్మెల్యేలున్నారు. ఈ ఏడాది చివర్లో అరుణాచల్ ప్రదేశ్‌లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి.