మునుగోడు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఆకాంక్షిస్తూ అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నభమ్ తూకి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ లో తెలంగాణ కోసం కొట్లాడుతున్న సందర్భంగా తమకు మాకు పూర్తి మద్దతు ఇచ్చాడు నభమ్ తూకి ఇచ్చారని అని గుర్తు చేసుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసి, 25 సంవత్సరాలు మంత్రిగా చేసి, ఒకసారి ముఖ్యమంత్రి గా పనిచేసి ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడుగా కొనసాగుతున్న నభం తూకి మునుగోడు నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రచారం చేయడానికివచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. తాను బీజేపీలోకి మారుతున్న సమయంలో వద్దని గట్టిగా చెప్పిన వ్యక్తని అన్నారు. ఆయన అప్పుడే బీజేపీ.... బీఆర్ఎస్ ఒకటని చెప్పారన్నారు. మళ్లీ తాను కాంగ్రెస్ లోకి మారిన తరువాత అరుణాచల్ ప్రదేశ్ నుంచి తనను చూడడానికి మన మునుగోడుకొచ్చారన్నారు.
ఎన్నికల సభలో నభమ్ తూకి మాట్లాడుతూ రాజగోపాలరెడ్డి తెలంగాణకే కాదు... అరుణాచల్ ప్రదేశ్ కు కూడా నాయకుడేనని అన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజల అభిమాన నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అరుణాచల్ ప్రదేశ్లో చైనా, మయన్మార్, భూటాన్ మూడు దేశాల సరిహద్దులలో ఆర్మీ జవాన్ల రవాణా కోసం క్లిష్టమైన భౌగోళిక ప్రదేశంలో 250 కిలోమీటర్ల రహదారిని నిర్మించారని తూకి తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ దేశ ప్రజల నడ్డి విరిచిందన్నారు. దేశ ప్రజల క్షేమం కోసం రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్నారు. రాజగోపాల్ రెడ్డి గెలిచిన తర్వాత మీ అందరిని కలవడానికి మళ్ళీ మునుగోడుకు వస్తానని తూకి అన్నారు.