మలయాళం నటి అరుంధతి నాయర్ (Arundhathi Nair) రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆమె కు తీవ్ర గాయాలవ్వగా..తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ లో చికిత్స పొందుతున్నారు.
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు వైద్యం అందించడానికి ఆర్ధిక సాయం చేయాలంటూ ఆమె సోదరి ఆరతి ఆరతి నాయర్, సీరియల్ నటి గోపిక అనిల్ సోషల్ మీడియా వేదికగా(Aratynairr Instagram) అభ్యర్ధిస్తున్నారు.
‘అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోంది. రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించే ఆర్ధిక స్థోమత ఆమె కుటుంబానికి లేదు. మేము మా వంతు కృషి చేస్తున్నాం. కానీ ప్రస్తుతం ఆమె చికిత్సకు అది సరిపోదు. ఆమె కుటుంబానికి ఎంతో సహాయకారిగా ఉండేందుకు మీరూ కూడా సహాయం చేస్తే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు సహాయపడుతుంది’ అంటూ బ్యాంకు, ఫోన్ నంబర్ వివరాలను ఇన్‌స్టా పోస్టులో పొందుపరిచింది.
అలాగే తాజాగా ఆమె సోదరి ఆరతి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..నేను ఈ వీడియోను చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే..ప్రస్తుతం అరుంధతి నాయర్ కండిషన్ ను అర్థం చేసుకోవడం కోసం చేస్తున్నాను. ఆమె వైద్య ఖర్చులకు నిజంగా సహకరించాలనుకునే వారి కోసం మేము కరెంట్ ఖాతాను ఓపెన్ చేశాము. అకౌంట్ డిటైల్స్ పూర్తిగా ఇంస్టాగ్రామ్ లో ఉంచాము.
ALSO READ :- AI నేర్చుకోండి..ఎంత కావాలంటే అంత జీతం : కంపెనీల బంపరాఫర్
కనుక మీరందరూ మా పరిస్థితిని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మరియు ఆమె కోలుకోవాలని మీరందరూ దయతో ప్రార్థించాలని కోరుకుంటున్నాను అంటూ ఆరతి ఆవేదనతో అభ్యర్ధించింది.
అలాగే అరుంధతి నాయర్ ఫ్రెండ్ నటి రమ్య స్పందిస్తూ..'ఆమె చికిత్స కోసం డబ్బు సహాయం అడిగినా తమిళ్ ఇండస్ట్రీ నుంచి ఎవరూ ముందుకు రావడం లేదని అరుంధతి ఫ్రెండ్, నటి రమ్య వాపోయారు. ‘అరుంధతికి బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. సాయం కావాలని అడుగుతున్నా నడిగర్ సంఘం నుంచి స్పందన లేదు’ అని తెలిపారు.