అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య..గోల్డెన్ ​జూబ్లీ పోస్టర్లు ఆవిష్కరణ

ఓయూ, వెలుగు: అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య గోల్డెన్​జూబ్లీ ఉత్సవాలను ఈ నెల 14, 15 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క తెలిపారు. గురువారం ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, భగవంతురెడ్డితో కలిసి ఉత్సవాల పోస్టర్​ను ఆవిష్కరించారు. 50 ఏండ్ల కింద ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలోనే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య పురుడు పోసుకుందని ఆమె తెలిపారు. అప్పటి నుంచి ఎంతోమంది కళాకారులను తయారు చేస్తూ, ప్రజల్లో చైతన్యం తెస్తున్నట్లు చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గోల్డెన్​జూబ్లీ ఉత్సవాలు ఉంటాయన్నారు.