డిసెంబర్ 14-15 తేదీల్లో అరుణోదయ 50 వసంతాల సభలు

డిసెంబర్ 14-15 తేదీల్లో అరుణోదయ 50 వసంతాల సభలు

హైదరాబాద్, వెలుగు: అరుణోదయ సంఘం ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్నది. ఈ నేపథ్యంలో శని, ఆదివారం హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభలు నిర్వహించనున్నారు. శనివారం సుందరయ్య పార్క్​ నుంచి వీఎస్​టీ ఫంక్షన్​ హాల్​ వరకు ప్రజా కళల ప్రదర్శన ఉంటుంది.  ఆదివారం ప్రతినిధుల సభ నిర్వహించనున్నారు.  ‘ప్రజా సాంస్కృతికోద్యమం– ఎదరువుతున్న సవాళ్లు’, ‘సామ్రాజ్యవాద సాంస్కృతిక దాడిని నివారించడం ఎలా?’  అనే అంశాలపై వక్తలు ప్రసంగించనున్నారు.