కాంగ్రెస్ పార్టీ కబుర్లను నమ్మే పరిస్థితి లేదు : ఆరూరి రమేశ్​

వర్ధన్నపేట, వెలుగు : అవినీతి పాలనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, ఆపార్టీ కబుర్లు ప్రజలు నమ్మే పరిస్థితి లేదని వర్ధన్నపేట నియోజక వర్గ బీఆర్​ఎస్​ అభ్యర్థి ఆరూరి రమేశ్ అన్నారు. మంగళవారం మండలంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, ప్రజలు ఊరురా స్వాగతం పలికారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, బోనాలు, మంగళహరుతులతో ఘన స్వాగతం పలికారు.   ఆరూరి రమేశ్​ మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి నాగరాజు కొత్త నాటకాలకు తెరతీశారని ఆరోపించారు.

ALSO READ :  గిరిజనులను పాలకులను చేసిన ఘనత కేసీఆర్​ది : ఎర్రబెల్లి దయాకర్​రావు 

ప్రజా మద్దతు లేక, ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియడం లేదు. పదేళ్లుగా ప్రజల మధ్యలో ఉంటూ వారి కష్ట సుఖాల్లో  పాలుపంచుకుంటున్నానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి, నియోజకవర్గ ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్నానని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు, ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ భిక్షపతి, పాక్స్ చైర్మన్ రాజేశ్ కన్నా, అత్మ చైర్మన్ గోపాల్ రావు, మండల అధ్యక్షుడు కుమారస్వామి, వైస్ ఎంపీపీ సోమలక్ష్మి- సోమయ్య, మార్కెట్ చైర్మన్ స్వామీ రాయుడు పాల్గొన్నారు.