కాజీపేట, వెలుగు : ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలని ఆ పార్టీ వర్ధన్నపేట క్యాండిడేట్ అరూరి రమేశ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం గ్రేటర్ వరంగల్ పరిధిలోని 43, 44, 45 డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.
తన తండ్రి అరూరి గట్టుమల్లు ఫౌండేషన్ పేరుతో స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇచ్చి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్నారు. కేంద్రం ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచడంతో పేదలు ఏమీ కొనలేని స్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే కర్నాటక పరిస్థితే వస్తుందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. అంతకుముందు అరూరిని గజమాలతో సన్మానించారు.
ALSO READ : గెలిపిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా : జాన్సన్ నాయక్