బీఫామ్‌‌ అందుకున్న ఆరూరి

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌‌ బీఆర్‌‌ఎస్‌‌ తరఫున బీఫామ్‌‌ అందుకున్నారు. సోమవారం సీఎం కేసీఆర్‌‌ ఆయనకు బీఫామ్‌‌ ఇచ్చారు. ఆరూరికి బీఫామ్‌‌ రావడంతో నియోజకవర్గ లీడర్లు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ మూడోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.