బీజేపీ గెలుపు కోసం ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తున్నయ్​ : ఆరూరి రమేశ్​  

ఆత్మకూరు, వెలుగు: బీజేపీ గెలుపు కోసం ప్రతిపక్షాలు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాయని వరంగల్ ఎంపీ క్యాండిడేట్ ఆరూరి రమేశ్​అన్నారు. బుధవారం బీజేపీ వరంగల్ జిల్లా ఆఫీస్ లో పరకాల నియోజకవర్గ పరిధిలోని దామెర, ఆత్మకూరు మండలాల బూత్ అధ్యక్షులు, కార్యకర్తలతో సన్నాక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి రమేశ్​ మాట్లాడుతూ రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, మళ్లీ ప్రధాని నరేంద్ర మోదీ అని ప్రతిపక్ష నాయకులు కూడా బహిరంగ చెప్తున్నారన్నారు. శత్రువులని కూడా మిత్రులుగా మలిచే నాయకత్వం మనదన్నారు. పార్లమెంట్ ప్రభారీ మురళీధర్ గౌడ్, జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు కాళీ ప్రసాద్, పార్లమెంట్ కన్వీనర్ కుమారస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.