డివిజన్ల అభివృద్ధే ప్రధాన లక్ష్యం : అరూరి రమేశ్‌‌‌‌‌‌‌‌

హసన్‌‌‌‌‌‌‌‌పర్తి, వెలుగు : వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌ వరంగల్‌‌‌‌‌‌‌‌ 55వ డివిజన్‌‌‌‌‌‌‌‌లోని భీమారం, కోమటిపల్లితో పాటు పలు కాలనీల్లో సీసీ రోడ్లు, సైడ్‌‌‌‌‌‌‌‌ డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అరూరి రమేశ్‌‌‌‌‌‌‌‌ బుధవారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాకుండా ప్రతీ గడపకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి విషయంలో ఎక్కడా వెనుకడుగు వేసేది లేదన్నారు. కార్యక్రమంలో 55వ డివిజన్‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌ జక్కుల రజిత వెంకటేశ్వర్లు, డివిజన్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ అటికం రవీందర్, ఎర్రగట్టు చైర్మన్‌‌‌‌‌‌‌‌ చింతల లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌యాదవ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.