లక్ష మందితో ప్రధాని మోదీ సభ

  • మేనిఫేస్టో విడుదల చేసిన బీజేపీ అభ్యర్థి ఆరూరి 

వరంగల్‍, వెలుగు: లక్ష మందితో వరంగల్​లో ఈ నెల 8న ప్రధాని మోదీ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ వరంగల్‍ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేశ్‍ తెలిపారు. సోమవారం పార్టీ నేతలు రావు పద్మ, ఎర్రబెల్లి ప్రదీప్‍రావు, మాజీ మేయర్‍ రాజేశ్వర్‍రావుతో కలిసి ఆయన ప్రెస్‍మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరూరి మాట్లాడుతూ దేశంలో మోదీ మూడోసారి ప్రధాని అవడం ఖాయమన్నారు. ఈ క్రమంలో తనను ఎంపీగా గెలిపిస్తే వరంగల్‍కు కావాల్సిన ప్రాజెక్టులు తీసుకువస్తానన్నారు. అనంతరం హామీలతో కూడిన మేనిఫేస్టోను రిలీజ్‍ చేశారు. నేతలు వన్నాల శ్రీరాములు, మురళీధర్‍ గౌడ్‍, కొండేటి శ్రీధర్‍, కుసుమ సతీశ్, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.