
ప్రేగ్: ఇండియా గ్రాండ్ మాస్టర్ అరవింద్ చిదంబరం.. ప్రేగ్ మాస్టర్స్ చెస్ టోర్నీలో కీలక విజయాన్ని సాధించాడు. గురువారం జరిగిన ఏడో రౌండ్ గేమ్‌లో అరవింద్ 39 ఎత్తులతో అనిష్ గిరి (నెదర్లాండ్స్)పై గెలిచాడు. దీంతో ఐదు పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. తాజా విజయంతో అరవింద్ లైవ్ రేటింగ్‌తో తొలిసారి 14వ ప్లేస్‌లో నిలిచాడు. క్వీన్స్ గాంబిట్ స్ట్రాటజీతో ఆడిన గిరి.. కింగ్ సైడ్ పావులకు చెక్ పెట్టి ఇండియన్ ప్లేయర్‌ను తక్కువగా అంచనా వేశాడు. కానీ 24వ ఎత్తు వద్ద కీలక ఎత్తు వేసిన అరవింద్ గేమ్‌ను వన్‌సైడ్ చేశాడు.
ఈ వ్యూహం నుంచి బయటపడటానికి గిరి చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ప్రజ్ఞానంద .. వీ యి (చైనా, 3.5) మధ్య జరిగిన గేమ్ 61 ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. ప్రస్తుతం ప్రజ్ఞా నాలుగున్నర పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. చాలెంజర్స్‌లో దివ్య దేశ్‌ముఖ్ (1.5).. జోనాస్ బుహ్ల్ బ్జెర్రే (డెన్మార్క్, 5.5) చేతిలో ఓడింది.