ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు : సీఎం కేజ్రీవాల్ కు బెయిల్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు : సీఎం కేజ్రీవాల్ కు బెయిల్

లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. 2024, సెప్టెంబర్ 13వ తేదీన.. సుదీర్ఘంగా సాగిన వాదనల తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటించింది కోర్టు. 

2024, జూన్ 26వ తేదీన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసింది సీబీఐ. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయన పాత్ర ఉందనే ఆరోపణలతో అదుపులోకి తీసుకుని.. విచారించి.. ఆ తర్వాత అరెస్ట్ చేసింది. 

సీఎం కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ.. కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సుదీర్ఘమైన జైలు శిక్ష అనేది అన్యాయంగా స్వేచ్ఛను హరించటమే అంటూ కామెంట్ చేసింది. 

Also Read :- మెడికల్ అడ్మిషన్ల స్థానికతపై సుప్రీంకోర్టుకు తెలంగాణ

సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో సీబీఐ వ్యవహరించిన తీరును ప్రస్తావించింది కోర్టు. సహకరించకపోవటం అంటే నేరాన్ని అంగీకరించినట్లు కాదని.. ఆ కారణంతో సీబీఐ అరెస్ట్ చేయటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.