AAP Poll Special:: మేం మళ్లీ వస్తే.. మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తాం: కేజ్రీవాల్

AAP Poll Special:: మేం మళ్లీ వస్తే.. మహిళలకు నెలకు రూ.2,100 ఇస్తాం: కేజ్రీవాల్

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవిందవ్ కేజ్రీవాల్ ఢిల్లీ మహిళలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహిళా సమ్మాన్ యోజనకు ఢిల్లీ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలి పింది. 

ఈ పథకం కింద గురువారం ( డిసెంబర్ 12) నుంచి దేశరాజధానిలోని మహిళలకు నెలకు రూ.1000 ఇవ్వనున్నట్లు తెలిపారు. దీంతో పాటు మరో బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఢిల్లీలో ఆప్ తిరిగి అధికారంలోకి వస్తే .. మహిళా సమ్మాన్ యోజన కింద వెయ్యికి బదులుగా రూ. 2వేలు ఇస్తామని ప్రకటించారు. 

వచ్చే ఏడాది ( 2025) ఫిబ్రవరిలో  ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ కాలం ఫిబ్రవరి 23, 2025తో ముగుస్తుంది. ఇంకా తేదీ ప్రకటించక పోయి నప్పటికీ కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 

ALSO READ | రాష్ట్ర చరిత్రలోనే ఫస్ట్ టైమ్: మహిళలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఇచ్చిన మాట ప్రకారం ఢిల్లీ మహిళలకు మహిళా సమ్మాన్ యోజన పథకం కింద రూ.1000 ప్రకటించారు.  మహిళలు రిజిస్టర్ చేయించుకొని లబ్ది పొందాలని ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ చెప్పారు. 

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో AAP  రెండుసార్లు అధికారం చేపట్టింది.. మూడోసారి కూడా అధికారాన్నినిలబెట్టుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించింది. 70 మంది సభ్యులున్న అసెంబ్లీలో ఆప్ 2015లో 67 సీట్లు, 2020లో 63 సీట్లు గెలుచుకుంది.