పంజాబ్ సీఎం అభ్యర్థిని ప్రకటించిన కేజ్రీవాల్

ఆప్ పంజాబ్ సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చారు పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబ్ లో తమ పార్టీ సీనియర్ లీడర్ భగవంత్ మన్.. పంజాబ్ ఆప్ సీఎం క్యాండెట్ అని చెప్పారు. భగవంత్ మన్ తనకు సోదరుడు లాంటి వారని.. పంజాబ్ ప్రజలు కోరుకున్న విధంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు కేజ్రీవాల్. పంజాబ్ లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆప్ కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. మొత్తం 117 స్థానాలున్న పంజాబ్‌లో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. గత ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు సాధించి పదేళ్ల తర్వాత తిరిగి అక్కడ అధికారం చేపట్టింది.

ఇవి కూడా చదవండి: 

ఎవరితో పొత్తుల్లేవ్.. ఒంటరి పోరాటమే

UP Assembly Election 2022: కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్