మిడిల్ క్లాస్ రాగం అందుకున్న కేజ్రీవాల్.. 7 అంశాల‌తో మేనిఫెస్టో

మిడిల్ క్లాస్ రాగం అందుకున్న కేజ్రీవాల్.. 7 అంశాల‌తో మేనిఫెస్టో

ఢిల్లీ ఎల‌క్ష‌న్ల‌ను ఎదుర్కోవ‌డంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ప్ర‌త్య‌ర్థుల‌కు భిన్నంగా అడుగులేస్తున్నారు. ఈసారి మిడిల్ క్లాస్ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు మేనిఫెస్టోను రెడీ చేశారు. బుధ‌వారం (22 జ‌న‌వ‌రి 2025) మిడిల్ క్లాస్ బ‌డ్జెట్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా కీలక వ్యాఖ్య‌లు చేశారు కేజ్రీవాల్. 

ఇప్ప‌టి వ‌ర‌కు ఇండియాను పాలించిన ప్ర‌భుత్వాలు మిడిల్ క్లాస్ ప్ర‌జ‌ల‌ను ఏటీఎంలుగానే చూశాయ‌ని, వారి జీవితంలో మార్పులు తీసుకొచ్చే చ‌ర్య‌లు మాత్రం తీసుకురాలేక పోయాయ‌ని విమ‌ర్శించారు. వివిధ ర‌కాల ట్యాక్స్ ల‌తో మిడిల్ క్లాస్ ప్ర‌జ‌లు అణ‌చివేయ‌బ‌డుతున్నార‌ని, ట్యాక్స్ టెర్ర‌రిజంలో బాధితులుగా మిగిలిపోయార‌ని అన్నారు. ఎక్కువ మొత్తంలో టాక్సులు క‌డుతూ.. చాలా త‌క్కువ‌ రిట‌ర్న్ పొందుతూ న‌ష్ట‌పోతూనే ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

ఢిల్లీలో AAP మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల కోసం ఎన్నో గొప్ప స్కీమ్స్ తీసుకొచ్చింద‌ని, వృద్ధుల ఆరోగ్యం కోసం తెచ్చిన సంజీవ‌ని స్కీమ్ అలాంటిదేన‌ని ఈ సంద‌ర్భంగా అన్నారు. ట్యాక్స్ పేయ‌ర్స్ డ‌బ్బుల‌ను ట్యాక్స్ పేయ‌ర్స్ సంక్షేమం కోస‌సం వినియోగించాల‌ని అన్నారు. అవ‌న్నీ ఉచిత ప‌థ‌కాలు అనే మాట‌ల‌ను కొట్టి పారేశారు. తాము రూపొందించే 7 మేనిఫెస్టోను కేంద్ర అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.


AAP 7 పాయింట్ల మేనిఫెస్టోః


1. ఎడ్యుకేష‌న్ బ‌డ్జెట్ ను 2% నుంచి 10 % పెంచాలి. ప్రైవేటు విద్యా సంస్థ‌ల‌లో ఫీజుల‌కు క‌టాఫ్ పెట్టాలి.

2. ఉన్న‌త విద్య కోసం స‌బ్సిడీల‌ను పెంచాలి. దీని వ‌ల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అభివృద్ధి సాధ్యం అవుతుంది.


3. ఆరోగ్యంపై బ‌డ్జెన్ ను 10 శాతానికి పెంచాలి. హెల్త్ ఇన్సురెన్స్ పై టాక్స్ ను ఎత్తేయాలి.

4. ఇన్ క‌మ్ టాక్స్ ప‌రిమితి 7 శాతం నుంచి 10 శాతానికి పెంచాలి.

5. నిత్యావ‌స‌ర స‌రుకులు, వ‌స్తువుల‌పై జీఎస్టీ ఎత్తేయాలి.

6. సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోసం పెన్ష‌న్ ప్లాన్ తీసుకురావాలి.

7. రైల్వేస్ లో సీనియ‌ర్ సిటిజ‌న్స్ కు 50 శాతం రాయితీ ఇవ్వాలి. 

70 స్థానాలున్న‌ ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్ర‌వ‌రి 5న నుంచి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 5న పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌గా, 8న ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఢిల్లీ ఎన్నిక‌ల్లో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య హోరా హోరీ పోర న‌డుస్తోంది.