పుష్ప-2 సాంగ్కు కేజ్రీవాల్..భాంగ్రా డ్యాన్స్కు పంజాబ్ సీఎం స్టెప్పులు

పుష్ప-2 సాంగ్కు కేజ్రీవాల్..భాంగ్రా డ్యాన్స్కు పంజాబ్ సీఎం స్టెప్పులు

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్  కేజ్రీవాల్ కూతురు హర్షిత పెళ్లి ఏప్రిల్ 18న రాత్రి  ఘనంగా జరిగింది. హర్షిత  తన స్నేహితుడు సంభవ్ జైన్ ను పెళ్లి చేసుకుంది.  పలువురు ప్రముఖులు,సన్నిహితులు ఈ పెళ్లికి అటెండ్ అయ్యారు.

అంతకుముందు   ఏప్రిల్ 17న రాత్రి ఢిల్లీలోని ఓ హోటల్ లో హర్షత్, సంభవ్  ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈ వేడుకలో  కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అదిరిపోయే స్టెప్పులేశారు.   కేజ్రీవాల్ తన సతీమణి సునీతతో కలిసి  పుష్ఫ2లో  చూసేటి అగ్గిరవ్వమాదిరే ఉంటాడే నా సామీ... సాంగ్ కు స్టెప్పులేసి అలరించారు.
 ఇక ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ దంపతులు  బాంగ్రా డ్యాన్స్  చేశారు. డ్యాన్సులు చేసేటప్పుడు అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది. ఈవీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:-అంబానీ పర్సనల్ డ్రైవర్ జీతం ఎన్ని లక్షలో తెలుసా..?

కేజ్రీవాల్ కూతురు హర్షిత,సంభవ్ జైన్ లు ప్రేమ వివాహం. కాలేజ్ లో లవ్ చేసుకున్న వీరిద్దరు ఇరు కుటుంబాల సమక్షంలో ఒక్కటయ్యారు.