అరవింద్ కుమార్ వాంగ్మూలమే కీలకం..ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం 

అరవింద్ కుమార్ వాంగ్మూలమే కీలకం..ఫార్ములా ఈ-రేస్ కేసులో దర్యాప్తు ముమ్మరం 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ–కార్ రేస్‌‌‌‌ కేసులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ అధికా రి అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ కీలకంగా మారింది. నిధుల మళ్లింపునకు సంబంధించి అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌ ఇచ్చే వాంగ్మూలాన్ని ఏసీబీ అధికారులు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు జనవరి 24న సీఎస్ శాంతికుమా రికి అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన 8 పేజీల ఎక్స్‌‌‌‌ ప్లనేషన్ లెటర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టను న్నారు.

ఇందులో భాగంగా ఇన్వెస్టిగేషన్ అధికారుల సమక్షంలో అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ స్టేట్‌‌‌‌ మెంట్‌‌‌‌ రికార్డ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సెంట్రల్ సర్వీసెస్ అధికారి కావడంతో డీఓపీటీ అనుమతి కోరనున్నట్లు తెలిసింది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే ఫార్ములా-–ఈ ఆపరేషన్(ఎఫ్ఈవో) సంస్థకు రూ.55 కోట్లు చెల్లించామని అరవింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ ఇదివరకే సీఎస్‌‌‌‌కు వెల్లడించారు.