ఐఓసీ చైర్మన్‌‌గా అరవింద్​ సింగ్ సాహ్నీ

ఐఓసీ చైర్మన్‌‌గా  అరవింద్​ సింగ్ సాహ్నీ

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ) చైర్మన్‌‌గా అరవింద్​ సింగ్ సాహ్నీ బాధ్యతలను స్వీకరించారు. ఆయన కాన్పూర్‌‌లోని హెచ్‌‌బీటీఐ నుంచి కెమికల్ ఇంజనీరింగ్​ చేశారు. 1993లో ఇండియన్ ఆయిల్‌‌లో చేరి రిఫైనరీ ఆపరేషన్స్, టెక్నికల్ సర్వీసెస్, హెల్త్, సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌‌మెంట్ (హెచ్‌‌ఎస్‌‌ఈ), పెట్రోకెమికల్స్‌‌తో సహా పలు విధుల్లో కీలకమైన పదవులు నిర్వహించారు. 

 పారాదీప్ రిఫైనరీని ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. సింగ్​  ఇంతకుముందు ఇండియన్ ఆయిల్ పెట్రో కెమికల్ వర్టికల్‌‌కు నాయకత్వం వహించారు.