-
ఆర్కే న్యూటెక్ మైన్ ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హియరింగ్
నస్పూర్/కోల్‌బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికవాడలకు శుద్ధి చేసిన తాగునీటిని సప్లై చేయడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని స్థానికులు ఫైర్అయ్యారు. కాలనీల్లో ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు. సింగరేణి ప్రభావిత గ్రామాల్లో డీఎంఎఫ్టీ ఫండ్స్‌తో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు చూపాలని కోరారు. బుధవారం శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలోని ఆర్కేన్యూటెక్ అండర్ గ్రౌండ్ కోల్‌మైన్ ఎన్విరాన్మెంట్ పర్మిషన్(రీ వ్యాలిడేషన్) కోసం ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్లో పబ్లిక్ హియరింగ్ చేపట్టారు. జిల్లా అడిషనల్కలెక్టర్ మోతిలాల్అధ్యక్షతన కాలుష్య నియంత్రణ మండలి(నిజామాబాద్) ఆధ్వర్యంలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. కార్మికులు, కార్మిక సంఘాలు, సింగరేణి ప్రభావిత గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, పర్యావరణ, సామాజిక వేత్తలు ప్రజాభిప్రాయసేకరణలో తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఆర్కే న్యూటెక్ అండర్‌గ్రౌండ్ మైన్ వల్ల తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆఫీసర్లు వెంటనే ఎన్విరాన్మెంట్పర్మిషన్లు ఇవ్వాలన్నారు. బొగ్గు గనుల్లోని పని స్థలాల్లో ఎస్డీఎల్మెషీన్లు, ఇతర యంత్రాల నుంచి వెలువడిన లుబ్రికేట్స్, ఇతర మలినాలతో కూడిన నీటినే గనుల్లో డ్యూటీలకు వచ్చే వారికి తాగేందుకు అందిస్తున్నారని,శుద్ధి చేసిన గోదావరి నీటిని సప్లై చేయాలని కార్మికులు, కార్మిక సంఘాల లీడర్లు డిమాండ్ చేశారు. పబ్లిక్ హియరింగ్‌లో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చడం లేదన్నారు. ప్రజల అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి ఇంజనీర్లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. శ్రీరాంపూర్ఏరియా సింగరేణి జీఎం బి.సంజీవరెడ్డి, పర్యావరణ జీఎం జె.వి.ఎల్.గణపతి, అడిషనల్ జీఎలు శ్రీనివాస్, రవికిరణ్, అడిషనల్ మేనేజర్ భాస్కర్‌రావు, శ్రీరాంపూర్ ఏరియా ఏస్వోటు జీఎం రఘుకుమార్ తదితరులు పాల్గొన్నారు.