Allu Arjun: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్లో.. అల్లు అర్జున్ ‘ఆర్య–2’ ఆల్‌టైమ్ రికార్డు..

Allu Arjun: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్లో..  అల్లు అర్జున్ ‘ఆర్య–2’ ఆల్‌టైమ్ రికార్డు..

టాలీవుడ్లో ప్రస్తుతం పాత సినిమాలను రీ రిలీజ్ చేస్తూ.. ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజు సందర్భంగా వారి పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4Kలో రిలీజ్ చేస్తున్నారు.

ఇప్పటికే పోకిరి, జల్సా, మురారి, గబ్బర్ సింగ్, బిజినెస్ మెన్, ఆరెంజ్, ఘరానా మొగుడు, బిల్లా, చెన్నకేశవ రెడ్డి, ఖుషి, వంటి మరికొన్ని సినిమాలు రీ-రిలీజ్ అయ్యాయి. ఇందులో చాలా సినిమాలు రిలీజ్ లెవల్లో వసూళ్లు సాధించాయి.

ఈ క్రమంలో (2025 ఏప్రిల్ 5న) ఆర్య 2 మూవీ థియేటర్లలలో రీ రిలీజ్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు (ఏప్రిల్ 8) సందర్భంగా రిలీజై బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోనే ఏకంగా రూ. 65 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.

ఇప్పటివరకు రీ రిలీజైన సినిమాల్లో, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సెంటర్‌లో, ఇంత మొత్తం సాధించడం ఇదే అత్యధికం. అంతకు ముందు మురారి రూ.62లక్షలు, గబ్బర్ సింగ్ రూ.54.8లక్షలు చేశాయి.ఇకపోతే, ఆర్య 2 ఓవరాల్ గా దాదాపు రూ.8కోట్ల గ్రాస్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.  

ఇకపోతే, సినిమా రీ రిలీజ్ రోజు సంధ్య థియేటర్ దగ్గర భారీగా పోలీస్లు మోహరించిన విషయం తెలిసిందే. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు పోలీసు బందోబస్తుతో చర్యలు తీసుకున్నారు. గుంపులు గుంపులుగా జనాలు ఉండొద్దని పలు కండిషన్స్ మధ్య ఆర్య 2 సినిమా నడిచింది. 

రీ రిలీజ్ సినిమాల టాప్ టోటల్ కలెక్షన్స్ రిపోర్ట్:

గిల్లి4K (తమిళం) – 32.50కోట్లు
మురారి4K– 8.90కోట్లు
గబ్బర్ సింగ్4కK– 8.01కోట్లు
ఆర్య 2 – 8 కోట్లు (రఫ్)
ఖుషి –7.46కోట్లు
SVSC రీ రిలీజ్ – 6.60కోట్లు
బిజినెస్ మ్యాన్4K – 5.85కోట్లు.