Arya : ఆర్య మిస్టర్ ఎక్స్ మూవీ యాక్షన్ -ప్యాక్డ్ టీజర్ విడుదల

Arya : ఆర్య మిస్టర్ ఎక్స్ మూవీ యాక్షన్ -ప్యాక్డ్ టీజర్ విడుదల

ఆర్య, గౌతమ్ కార్తీక్ లీడ్ రోల్స్‌‌లో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’.  మను ఆనంద్ దర్శకత్వంలో  ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. శరత్ కుమార్, మంజు వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  తాజాగా ఈ మూవీ టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. భారతీయ గూఢచారుల జీవితాల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలియజేశారు. ఓ న్యూ క్లియర్ డివైజ్ చుట్టూ కథ తిరగనుందని తెలుస్తోంది. ‘మనం దానిని భద్రపరచకపోతే, ఏ క్షణంలోనైనా ఎక్కడైనా ఎటాక్  జరగవచ్చు’ అని మంజు వారియర్  చెప్పడం ఉత్కంఠని పెంచింది.

 ఆ డివైజ్‌‌ను  ట్రాక్ చేయడానికి, ఎటాక్‌‌ని ఆపడానికి  ది ఎక్స్ ఫోర్స్‌‌గా ఆర్య, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్ చేసిన సాహసాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి.  ఇందులో అతుల్య రవి, రైజా విల్సన్, అనఘ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దివ్యాంక ఆనంద్ శంకర్ , రామ్ హెచ్ పుత్రన్ స్క్రీన్‌‌ప్లే అందించిన ఈ చిత్రానికి ధిబు నినన్ థామస్ సంగీతం అందించాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమా  విడుదల కానుంది.