
- 1875లో ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి స్థాపించారు.
- నిజాం కాలంలో దళితులు, నిరుపేద హిందువులను ఇస్లాం మతంలోకి అంజుమన్ తబ్లీ గులిస్లాం సంస్థ చేర్చింది.
- మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థను బహదూర్ యార్జంగ్ ఏర్పాటు చేశాడు.
- అసఫ్‌జాహీ వంశం ముస్లిం పాలనకు చిహ్నమని, దాన్ని సుస్థిరంగా కాపాడటం ప్రతి ముస్లిం ధర్మమని రాజకీయ మతోన్మాదాన్ని ప్రచారం చేసిన సంస్థ మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్.
- మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనల్ మాలిక్(నేనే రాజు) అనే నినాదాన్ని ఇచ్చింది.
- స్వామి దయానంద సరస్వతి హైదరాబాద్‌లో 1892లో స్వయంగా ఆర్య సమాజం శాఖను ఏర్పాటు చేశారు.
- హైదరాబాద్‌లో ఆర్య సమాజం మొదటి అధ్యక్షుడు కమతా పర్షాద్.
- హైదరాబాద్‌లో ఆర్య సమాజం మొదటి వార్షికోత్సవాలు కందస్వామి బాగ్‌లో జరిగాయి.
- హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మార్చబడ్డ వారిని తిరిగి హిందూ మతంలోకి మార్చడానికి ఆర్య సమాజం శుద్ధి సభను స్థాపించింది.
- హిందూ మతంలో మూఢనమ్మకాలు, దురాచారాలను తొలగించడానికి ఆర్యసమాజం సంస్కరణ ఉద్యమం చేపట్టింది.
- ఆర్య సమాజం ప్రచారాన్ని అడ్డుకోవడానికి సనాతన వాదులు ధర్మ మహామండలిని ఏర్పాటు చేశారు.
- ఆర్య సమాజ్ ముఖ్య గ్రంథమైన సత్యార్థ ప్రకాశికను పండిత కేశవరావు కోరాట్కర్ తెలుగులోకి అనువదించాడు.
- వితంతువుల పునర్ వివాహాల చట్టం తీసుకురావాలని హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలో 1930లో ఆర్య సమాజం నాయకుడు పండిత కేశరావు కోరాట్కర్ తీర్మానం ప్రతిపాదించాడు.
- నిజాం రాజ్యంలో వితంతువుల పునర్ వివాహాల చట్టం రూపుదాల్చడానికి పండిత వినాయకరావు విద్యాలంకార్ కృషి చేశాడు.
- ఆర్య సమాజం అధ్యక్షులుగా పనిచేసిన పండిత కేశవరావు కోరాట్కర్ 1932 మే 21న మరణించాడు.
- పండిత కేశవరావు కోరాట్కర్ మరణానంతరం ఆర్య సమాజ్ హైదరాబాద్ అధ్యక్షులుగా పండిత వినాయకరావు విద్యాలంకార్ వ్యవహరించారు.
- ఆర్య సమాజ్ కేంద్ర ప్రచారకులు పండిత రామచంద్ర దహల్వీ, చంద్రభాను హైదరాబాద్ రాజ్యం పర్యటించకుండా ఏడో నిజాం నిషేధ ఆజ్ఞలు జారీ చేశాడు.
- నిజాం ప్రభుత్వం వాక్ స్వాతంత్ర్యాన్ని అడ్డుకునే గస్తీ నిషన్ తిర్పన్ (జీవో నంబర్ 53)ను 1937లో తీసుకువచ్చారు.
- ఆర్య సమాజ్ కార్యదర్శి నరేంద్రజీని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి మన్ననూర్ జైలుకు పంపించింది.
- 1938లో అఖిల భారత ఆర్యసమాజ్ మహాసభ షోలాపూర్‌లో జరిగింది.
- ఆర్యసమాజ్ అఖిల భారత మహాసభ 1938 జనవరి 20న దేశ వ్యాప్తంగా హైదరాబాద్ విమోచన దినంగా పాటించాలని పిలుపు ఇచ్చింది.
- నిజాం ప్రభుత్వం అనుసరిస్తున్న పక్షపాత ధోరణిని నిరసిస్తూ హైదరాబాద్ సంస్థానంలో సత్యాగ్రహం నిర్వహించే బాధ్యతలను మహాత్మ నారాయణస్వామికి ఆర్యసమాజ్ అప్పగించింది.
- నిజాం ప్రభుత్వం మహాత్మ నారాయణస్వామిని 1939 జనవరి 31న అరెస్టు చేసింది.
- నిజాం ప్రభుత్వం అరెస్టు చేసి షోలాపూర్‌లో విడుదల చేసిన అనంతరం ఆర్యసమాజ్ నాయకుడు నారాయణ స్వామి గుల్బర్గాలో సత్యాగ్రహం చేశారు.
- 1944 నాటికి హైదరాబాద్ సంస్థానంలో 300 ఆర్య సమాజ్ శాఖలు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాయి.
- హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలని కోరుతూ 1947 సెప్టెంబర్ 2న ఆర్య సమాజ్ కార్యకర్తలు భారత జాతీయ పతాకావిష్కరణ చేశారు.
- ఆర్య సమాజ్ కార్యకర్తలు పరకాలలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 150 మంది మరణించారు.
- 1939లో హైదరాబాద్‌లో కేశవ మెమోరియల్ స్కూల్‌ను స్థాపించారు.
- 1934లో ఆర్య సమాజ్ వేదిక ఆదర్శ్ పత్రికను ప్రచురించింది.