- హైదరాబాద్ సంస్థానంలోని బీడ్ జిల్లా ధరూర్ గ్రామంలో 1892లో మొదటి ఆర్య సమాజ్ సంస్థ ఏర్పాటైంది.
- హైదరాబాద్‌లో ఆర్యసమాజ్ 1905లో సొంత భవనాన్ని సమకూర్చుకుంది.
- హిందూ ధర్మరక్షణ కోసం ఆర్యసమాజ్‌కు పోటీగా హైదరాబాద్‌లో సనాతన ధర్మ మహామండల్ను స్థాపించారు.
- నిజాం ప్రభుత్వం ఆర్య సమాజ్ ప్రచారకులైన పండిత్ బాలకృష్ణశర్మ, నిత్యానంద బ్రహ్మచారిలను దేశం నుంచి బహిష్కరించారు.
- 1896లో ఆర్య సమాజ్‌కు హైదరాబాద్‌లో కేశవరావు కోరాట్కర్ నాయకత్వం వహించారు.
- హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు, సమితులను మరాఠీ మాట్లాడేవారు ప్రారంభించారు.
- కేశవరావు కోరాట్కర్ హైదరాబాద్ ఆర్య సమాజానికి 1932 వరకు అధ్యక్షులుగా కొనసాగారు.
- ఆర్యసమాజ్ పవిత్ర గ్రంథమైన సత్యార్థ ప్రకాశ్ తెలుగులోకి 1921లో అనువదించారు.
- తాను లింగాయత మత స్థాపకుడైన చిన్న బసవేశ్వరుని అవతారంగా ప్రకటించుకుని, ఆ తత్వాన్ని ఇప్పటి ఇస్లాంగా అభివర్ణించి హిందువులను ఇస్లాం మతం తీసుకోవాల్సిందిగా 1929లో సిద్ధిక్ దీన్దార్ ప్రచారం ప్రారంభించింది.
- 1930లో హిందూ వితంతువుల హక్కుల కోసం పోరాడి చట్టం రావడానికి పండిత్ కేశవరావు కృషి చేశారు.
- ఆర్యసమాజ్‌కు చెందిన కేంద్ర ప్రతినిధి సభ 1930లో మహాత్మా నారాయణ స్వామి మార్గదర్శకత్వంలో ఏర్పడింది.
- 1932 మే 21న పుణెలో పండిత్ కేశవరావు మరణించిన తర్వాత ఆర్య సమాజ్‌కు పండిత్ వినాయక్‌రావు విద్యాలంకార్ అధ్యక్షుడు అయ్యారు.
- 1934లో ఆర్యసమాజ్ హైదరాబాద్‌లో వేదిక్ ఆదర్శ్ అనే ఉర్దూ పత్రిను ప్రారంభించారు.
- ఆర్యసమాజ్ 1934లో ప్రారంభించిన ఉర్దూ పత్రిక వేదిక్ ఆదర్శ్ హైదరాబాద్ ప్రభుత్వం 1935లో నిషేధించింది.
- ఇస్లాం మతం స్వీకరించనందుకు గంజోటిలో ఆర్య సమాజ్ కార్యకర్త వేద ప్రకాశ్‌ను హత్య చేశారు.
- ఆర్య సమాజ్ హవన కుండాలు ఏర్పరచరాదని ఆజ్ఞాపించిన నేపథ్యంలో 1938 ఏప్రిల్ 16న హైదరాబాద్‌లోని ధూల్‌పేటలో తీవ్రమైన మతఘర్షణలు చెలరేగాయి.
- ఆర్యసమాజ్‌పై జరుగుతున్న పోలీసు అఘాయిత్యాలకు నిరసనగా దేవీలాల్ సత్యాగ్రహం ప్రారంభించారు.
- 1938 మత ఘర్షణల అనంతరం హైదరాబాద్‌లో ఆర్యసమాజ్ కార్యక్రమాల నాయకునిగా మహాత్మ నారాయణస్వామి బాధ్యతలు స్వీకరించారు.
- ఆర్య సమాజ్ నాయకుడు మహాత్మ నారాయణస్వామిని హైదరాబాద్‌లో ప్రవేశంపై 1939 జనవరి 31న ప్రభుత్వం నిషేధం విధించింది.
- మహాత్మా నారాయణ స్వామిని హైదరాబాద్‌లోకి అనుమతించనందుకు నిరసనగా చేపట్టిన సత్యాగ్రహాన్ని ఆర్యసమాజ్ కార్యకర్తలు 1939 ఆగస్టు 7న ఉపసంహరించుకున్నారు.
- ఆర్యసమాజ్ హైదరాబాద్‌లో పండిట్ కేశవరావు స్మారక పాఠశాలను 1940 జులై 20న ప్రారంభించారు.
- 1941లో ఆర్య ప్రతినిధి సభకు కార్యదర్శిగా పండిట్ నరేందర్ జీ బాధ్యతలు స్వీకరించారు.
- ఆర్య సమాజ్ను హైదరాబాద్ ప్రభుత్వం విద్రోహ సంస్థగా పరిగణించిన కాలం 1942 నుంచి 1948 వరకు.
- 1942 మార్చి 3న ఊరేగింపుగా వెళ్తున్న ఆర్య సమాజ్ కార్యకర్తలను ముస్లింలు అడ్డగించి, నలుగురిని తుపాకులతో కాల్చి చంపిన ఘటన హుస్నాబాద్‌లో జరిగింది.
- 1943లో ఆర్యసమాజ్ సమావేశంలో గణపతి కాశీనాథ శాస్త్రిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
- ఆర్యసమాజ్ కార్యకర్తలకు శిక్షణ శిబిరంగా సాధ్యయమండలిని ఘట్కేసర్లో స్థాపించారు.
- ఆర్యసమాజ్ మూడో సమావేశం రామ్శరత్ చంద్జీ అధ్యక్షతన 1944లో నారాయణపేటలో జరిగింది.
- 1945లో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో నల్లగొండలో ఉపదేశిక్ విద్యాలయం స్థాపించారు.
- ఆర్యసమాజ్ నాలుగో సమావేశం 1945 ఏప్రిల్‌లో గుల్బర్గాలో రాజ్‌నారాయణ్ లాల్ పత్తి అధ్యక్షతన జరిగింది.
- ఐదో ఆర్యసమాజ్ సమావేశం 1946లో వరంగల్ పట్టణంలో జరిగింది.
- వరంగల్ పట్టణంలో 1946లో జరిగిన ఆర్యసమాజ్ సమావేశానికి పండిట్ వినాయక్ రావు అధ్యక్షతన జరిగింది.
- 1946లో ఆర్యసమాజ్ కార్యక్రమాలపై నిషేధం తొలగించి, జైళ్లలో మగ్గుతున్న కార్యకర్తలను నిజాం ప్రభుత్వ ప్రధాని మీర్జా ఇస్మాయిల్ విడుదల చేశారు.
- ఆర్యసమాజ్ తరఫున ఆర్యాభాన్ పత్రికను నడుపుకోవడానికి మీర్జా ఇస్మాయిల్ అనుమతించారు.
- ఆర్యసమాజ్ ఆరో సమావేశం 1947లో జాల్నాలో గోవిందలాల్ పిత్తి అధ్యక్షతన జరిగింది.
- నిజాం వెళ్తున్న కారుపై చేతిగ్రెనేడ్ విసిరి 20 సంవత్సరాల జైలుశిక్షకు గురైన ఆర్య సమాజ్ కార్యకర్తలు నారాయణ్ పవార్, ఆయన అనుచరులు గండయ్య, జగదీష్.
- భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్ సంస్థానానికి దౌత్యవేత్తగా నియమించబడిన కె.ఎం.మున్షీకి రజాకార్ల వ్యూహాన్ని, ఆయుధ సమీకరణ రహస్యాలను చేరవేసి,
- హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం చేయడానికి పరోక్షంగా
- సాయపడిన ఆర్యసమాజ్ నాయకులు వందేమాతరం రామచంద్రరావు, ఆయన సోదరుడు వీరభద్రరావు.