The Village Web Series Review: OTT ప్రేక్షకులను భయపెడుతున్న క‌ట్టియాల్ సస్పెన్స్ థ్రిల్లర్..

The Village Web Series Review: OTT ప్రేక్షకులను భయపెడుతున్న క‌ట్టియాల్ సస్పెన్స్ థ్రిల్లర్..

డిఫరెంట్ కాన్సెప్ట్‌‌ సినిమాలతో కోలీవుడ్ హీరో ఆర్య తెలుగు ఆడియాన్స్ కు సుపరిచితమే. లేటెస్ట్ ఆర్య నటించిన తొలి వెబ్‌సిరీస్ ది విలేజ్. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్లో ప్రేక్ష‌కులను వీపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ హార‌ర్ థ్రిల్ల‌ర్ వెబ్‌సిరీస్‌కు గృహం ఫేమ్ మిలింద్ రావ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆర్యకు జోడీగా దివ్య పిల్లై నటించింది. ఈ సీరీస్లో ఆడుకాలం న‌రేన్ కీల‌క పాత్ర‌ పోషించారు. త‌మిళం, తెలుగు భాష‌ల్లో ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తొలిసారి హార్రర్ జోనర్తో వచ్చిన ఆర్య డెబ్యూ వెబ్‌సిరీస్ ఎలా ఉంది? ఈ సిరీస్‌తో డైరెక్ట‌ర్ మిలింద్ రావ్ ఆడియెన్స్‌ను మరోసారి భ‌య‌పెట్టాడా? లేదా? అన్న‌ది తెలియాలంటే విలేజ్ (క‌ట్టియాల్) లోకి వెళ్లాల్సిందే..

క‌ట్టియాల్ కథ : 

ఎంతో మిస్టీరియస్ చరిత్ర కలిగిన క‌ట్టియాల్ అనే ఊరు. భీభత్సమైన సునామీ తాకిడి కార‌ణంగా క‌ట్టియాల్ ఊరు నిర్మానుష్యంగా మారిపోతుంది.ఇదే ఊరిలో ఉన్న పాత కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ ఒకటి మిస్టీరియస్ గా ఉంటుంది.ఈ ఫ్యాక్టరీ చుట్టూ ఏదో అలజడి ఉన్నట్టు చుట్టూ ప్రక్కల ఉన్న వారిని భయపెడుతూ ఉంటోంది.అంతేకాకుండా ఇక్కడ ద‌య్యాలు ఉన్నాయ‌నే క‌థ‌లు ప్ర‌చారంలో ఉంటాయి. ఇక ఆ ఫ్యాక్ట‌రీ వైపు వెళ్లిన ప్రతిఒక్కరు తిరిగి వ‌చ్చినట్టు చరిత్ర కనిపించదు. అంతలోనే ఒక ప్రయాణానికి బయలుదేరిన డాక్ట‌ర్ గౌత‌మ్ (ఆర్య‌) అత‌డి భార్య నేహా (దివ్యా పిళ్లై), కూతురు మాయ‌తో క‌లిసి అనుకోకుండా ఆ ఫ్యాక్ట‌రీ వైపు వ‌స్తాడు. సరిగ్గా ఆ ఫ్యాక్ట‌రీ ముందు కారు టైర్ పంక్ఛ‌ర్ కావ‌డంతో మొదలైన సస్పెన్స్ వెబ్ సిరీస్ అంతా కనిపిస్తోంది.గౌతమ్ ఒంటరిగా వెళ్లి నేహా, మాయ‌ల‌ను కారులోనే ఉంచి.. స‌హాయం కోసం ప‌క్క‌నే ఉన్న మ‌రో ఊరికి వ‌స్తాడు. ఇక అంతలోనే ఫ్యాక్టరీకి తిరిగివ‌చ్చేస‌రికి ఉన్నట్టుండి నేహా, మాయ క‌నిపించ‌కుండాపోతారు. ఇక అక్కడ మొదలైన ఉత్కంఠ..చివరివరకు ఆడియన్స్ లో క్రియేట్ చేశాడు డైరెక్టర్.

గౌతమ్ వారిని వెత‌క‌డానికి క‌ట్టియాల్ ఊరిలోకి వెళ్లగా..క‌ట్టియాల్ ఊరుతో సంబంధం ఉన్న శ‌క్తి (ఆడుకాలం న‌రేన్‌), క‌రుణాక‌ర్‌(ముత్తుకుమార్‌), పీట‌ర్(జార్ట్ మ‌రియ‌న్‌) అనే ముగ్గురు వ్య‌క్తులు తోడుగా వాళ్ళని వెతకడానికి వ‌స్తారు. అంతేకాకుండా..ఆ ఫ్యాక్టరీ మిస్టరీని తెలుసుకోవడానికి శాంపిల్స్ కోసం జ‌గ‌న్‌తో (త‌లైవాస‌ల్ విజ‌య్‌) పాటు ఫ‌ర్హాన్ (జాన్ కొక్కెన్‌) అనే ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్‌ ఆ ఫ్యాక్టరీకి వస్తోంది. నేహా, మాయ అదృశ్యం కావ‌డానికి కార‌ణం ఏమిటి? గత 20 ఏళ్లుగా పాడుబడ్డ ఆ ఫ్యాక్ట‌రీలో నిజంగానే ద‌య్యాలు ఉన్నాయా? మాయాద్వీపం వంటి ఈ ఫ్యాక్టరీ చుట్టూ దాగున్న శక్తులేంటి అనేది సస్పెన్స్ థ్రిల్లర్ గా డైరెక్టర్ తెరకెక్కించాడు. 

విశ్లేషణ :

ది విలేజ్..స్టోరీ హాలీవుడ్ ఫ్రీమేక్‌లా ఉంది. ఇంతకు ముందు హాలీవుడ్‌లో వ‌చ్చిన హిల్ హావ్ ఐస్, రాంగ్‌ట‌ర్న్ లాంటి సినిమాల స్ఫూర్తితో ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ను రాసుకున్నాడు. ఒక ర‌కంగా ఆ సినిమాల‌కు ఫ్రీమేక్‌గా వచ్చిన సిరీస్‌గా దీన్ని చెప్ప‌వ‌చ్చు. సినిమాలో చూపించిన ఆ హార‌ర్ పాయింట్‌కు..తనదైన ఎమోషన్స్ ను జోడించి ది విలేజ్ సిరీస్‌ను చాలా ఆసక్తిగా డైరెక్టర్ తెరకెక్కించాడు. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో థ్రిల్లింగ్ గా ఉంది. 

స్టోరీ విషయానికి వస్తే..క‌ట్టియాల్‌లో అడుగుపెట్టిన గౌత‌మ్‌, శ‌క్తి, క‌రుణాక‌ర‌ణ్‌, పీట‌ర్ ప్రాణాల‌ను కాపాడుకోవ‌డానికి అక్క‌డి మాయాద్వీపంలోని వింత ఆకారాల‌తో కూడిన శక్తులతో ఎలాంటి పోరాటం చేశారు? వారి రూపాలతోనే దడ పుట్టించే శక్తులతో గౌతమ్ ఎలా పోరాడన్నాడనే అంశం ఆడియాన్స్ క్యురిసిటీని పెంచేసిందని చెప్పవచ్చు. ఈ సిరీస్ మొదలవుతూనే అటు వైపు వెళ్లిన కొంతమంది మనుషులను చంపే సీన్స్ గూస్బంప్స్ వచ్చేలా ఉన్నాయి. ఇక అంతలోనే గౌతమ్ ఫ్యామిలీ మాయమవ్వడం తో కథ మరింత లోతుగా వెళుతూ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. ఇక సినిమా టర్న్ అయ్యే సమయంలో గౌత‌మ్‌కు ఆ ఊరి చ‌రిత్ర‌ను శ‌క్తి చెప్పే సీన్‌తో ఫ్లాష్‌బ్యాక్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్ట‌ర్‌. ఊరి గొడ‌వ‌లు, జీఎస్ఆర్ చేసిన ప‌రిశోధ‌న‌ల కార‌ణంగా ఊరి పెద్ద అమ‌ర్ రాజా తో పాటు అత‌డి అనుచ‌రులు న‌ర‌మాంస‌భ‌క్ష‌కులుగా ఎలా మారార‌న్న‌ది ఇంటెన్సివ్ గా చూపించారు. ఇలాంటి టైంలోనే డైరెక్టర్ ఎక్కువ ట్విస్టులు పెట్టకపోవడం కాస్తా మైనస్ అయ్యాయని ఆడియన్స్ లో ఫీలింగ్ కలిగిస్తోంది. ఇక చివరి ఎపిసోడ్ లో క్లైమాక్స్ ఇంకా బాగా రాసుకుని ఉండుంటే కథ వేరే లెవెల్ కి వెళ్లి ఉండేదని కోలీవుడ్ ఆడియాన్స్ నుంచి టాక్ వినిపిస్తోంది. 

చివరలో హీరో ఆర్య (గౌతమ్) ఫ్యాక్ట‌రీలోని వింత ఆకారపు మ‌నుషుల‌తో తన ప్రాణాలకు తెగించి మరి..పోరాడే సీన్స్ అక్కట్టుకున్నప్పటికీ ఏదో తెలియని రొటీన్ ఫార్ములా అనిపించేలా ఉంటుంది. కానీ మొత్తానికి ఈ సీరీస్ చివరి ఎపిసోడ్ వరకు ఆడియన్స్ కు థ్రిల్ కలిగించేలా చేస్తోంది. 

ఎవరెలా చేశారు : 

ఇంటెన్సివ్ పాత్రలో ఆర్య కనిపించి మెప్పించాడు. ఆడుకాలం నరేన్కు మంచి పాత్ర దక్కగా..నటనలో ప్రతిభ కనబరిచాడు. రియ‌ల్ లైఫ్ క‌పుల్ జాన్ కొక్కేన్‌, పూజా రామ‌చంద్ర‌న్ యాక్ష‌న్ పాత్ర‌ల్లో న‌టించి..పర్వాలేదనిపించారు. ప్రైవేట్ సెక్యూరిటీ టీమ్ ఛీఫ్‌గా జాన్ కొక్కేన్‌, అత‌డి టీమ్‌మేట్ గా పూజా రామ‌చంద్ర‌న్ వారి పాత్రల పరిధి మేరకు నటించారు. ఆర్యకు జోడిగా నటించిన దివ్య పిల్లై ఓ గెస్ట్ రోల్ చేసిన ఫీలింగ్ ఇస్తోంది. 

టెక్నీషియన్స్ : 

డైరెక్టర్ మిలింద్ రావ్ తనదైన కోణంలో ది విలేజ్ సినిమాని..ఒక మాయలోకంలోకి తీసుకెళ్లి వింత ఆకారపు జీవులతో సస్పెన్స్ కలిగిలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. గిరిష్ గోపాలకృష్ణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ విజయన్ స్క్రీన్ ప్రజెన్స్ చాలా థ్రిల్లింగ్ కలిగిస్తోంది.