హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్ఎస్, పది నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అని కేటీఆర్, హరీశ్‌రావుకు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత సవాల్ విసిరారు. శనివారం గాంధీ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు పదేండ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయకుండా దోచుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ ప్రభుత్వంపై దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ సర్వే చేసిన డేటా ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేస్తుంటే బీఆర్ఎస్ ఆటంకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని రాజకీయాలు చేసినా మూసీ ప్రక్షాళన ఆగదని సుజాత పేర్కొన్నారు.