పర్వతగిరి/ వర్ధన్నపేట/ కాశీబుగ్గ/ కొత్తగూడ, వెలుగు: ఉమ్మడి వరంగల్జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా హీ సేవ–24లో భాగంగా శుక్రవారం అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులతో మీటింగ్ఏర్పాటు చేసి పారిశుద్ధ్యంపై ప్రతిజ్ఞ చేయించారు. పలుచోట్ల ర్యాలీలు, ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. వరంగల్జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ తహసీల్దార్వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్నాయక్ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టగా, మండల కేంద్రంలో సెక్రటరీ, జీపీ సిబ్బందితో నిర్వహించారు.
వర్ధన్నపేట మండలం ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో ఎంపీడీవో వెంకటరమణ ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా కొత్త గూడ పాఠశాలలో హెచ్ఎం విష్ణువర్ధన్రావు ఆధ్వర్యంలో విద్యార్థులకు కార్యక్రమంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. కాజీపేట రైల్వే ప్రాంతంలోని సాయిబాబా ఆలయ సమీపంలో భారత ఆహార సంస్థ మేనేజర్ధీరజ్కుమార్ ఆధ్వర్యంలో ఎఫ్సీఐ సంస్థ ఉద్యోలుగు పరిసరాలను శుభ్రం చేశారు.