సంపాదకుడిగా దేశాయి కొన్ని ముఖ్యమైన గ్రంథాలు రాశారు. సాగా ఆఫ్ ఆజాద్ హింద్ మొదటి బుక్ కాగా, వందే మాతరం టు జనగణమన, సాగా ఆఫ్ హైదరాబాద్ ఫ్రీడమ్స్ట్రగుల్, అన్టోల్డ్స్టోరీ ఆఫ్ఏ జైల్జర్నల్– ది డెమోక్రట్ పుస్తకాలు తీసుకొచ్చారు. 1800 నుంచి 1956 వరకు చరిత్ర ప్రసిద్ధికెక్కిన హైదరాబాద్ సంస్థాన విమోచనోద్యమ చరిత్రను స్వామి రామానందతీర్థ మెమోరియల్కమిటీ వారు గ్రంథ రూపంలో తీసుకువచ్చే బాధ్యతలను దేశాయికి అప్పగించగా ఆయన దాన్ని విజయవంతంగా నిర్వహించారు.
భవన్స్ కాలేజీ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్అండ్ మేనేజ్మెంట్కు దేశాయి ప్రిన్సిపల్‌గా పనిచేశారు. భారత ప్రభుత్వ తామ్రపత్ర గుర్తింపుతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. హిందూ ముస్లిం ఐక్యతా అవార్డు, కర్నాటక ప్రెస్ అకాడమీ అవార్డు, తిలక్ మోహరరీ అవార్డు, రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు, సుభాష్‌చంద్రబోస్ అవార్డులు వచ్చాయి. నేషనల్లిటరసీ మిషన్‌కు గౌరవ చైర్మన్‌గా వ్యవహరించారు.
– కాశెట్టి కరుణాకర్,వెలుగు ప్రతినిధి