అమెరికాలో కమ్యూనిస్టుల మార్చ్.. బిలియనీర్ ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..

అమెరికాలో కమ్యూనిస్టుల మార్చ్.. బిలియనీర్ ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే..

కమ్యూనిజం, అమెరికన్లు చేతులు కలిపాయనే ఆలోచన ఎవరూ చేయరు. అమెరికాలో కమ్యూనిజం ఉంటుందంటే ఎవరూ నమ్మరు. కమ్యూనిజాన్ని అమెరికన్లు ఓ గ్రహాంతర ఆందోళనగా భావిస్తారు. అలాంటి పెట్టుబడి దారీ దేశం అయిన అమెరికాలో కమ్యూనిజం మరోసారి బహిరంగ చర్చలోకి వచ్చింది. 

కొత్తగా ఏర్పడిన రెవల్యూషనరీ కమ్యూనిస్టు ఆఫ్ అమెరికా (RCA) పార్టీకి చెందిన కార్యకర్తలు అమెరికా వీధుల్లో కవాతు చేశారు. రివెల్యూషనరీ కమ్యూనిస్టుల అమెరికన్ అధ్యాయాన్ని స్థాపించేందుకు ఫిలడెన్ఫియాలలో తొలిసారి సమాశం నిర్వహించారు. దాదాపు 500 మంది ఆర్ సీఏ కార్యకర్తలు ఫిలడెల్ఫియా వీధుల్లో ఎర్రటి టీషర్టులు ధరించి, సుత్తి , కొడవలి గుర్తుతో రెపరెపలాడుతున్న జెండాలతో రెడ్ మార్చ్ నిర్వహించారు. ‘‘క్లాస్ వార్ 2024 ’’అని మార్చ్ సందర్భంగా నినాదాలు చేశారు. 

ఈ మార్చ్కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను RCA సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం Xలో షేర్ చేశారు. ‘‘అమెరికా కమ్యూనిస్టు తరానికి హలో చెప్పండి’’అని ట్యాగ్ చేశారు. "బిలియనీర్లు పరాన్నజీవులు" అనే క్యాప్షన్‌ ఇచ్చారు. 

ఆర్ సీఏ పోస్ట్ చేసిన మరో వీడియోలో పెట్టుబడిదారీ విధానాన్ని పారద్రోలే పార్టీలో చేరండి" అని పిలుపునిచ్చారు. కవాతు చేస్తున్న కమ్యూనిస్టులు డెమొక్రాట్‌లకు ఓటు వేస్తారని  నెటిజన్లు అడిగిన ప్రశ్నకు.."లేదు. డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఇద్దరూ బిలియనీర్ల పార్టీలు" అని బదులిచ్చారు. అందుకే కొత్త పార్టీని స్థాపించాం’’ అని ట్వీట్ లో తెలిపారు. 

అయితే ఈ మార్చ్ సంబంధించి షేర్ చేసిన ఫొటోలు అందరికంటే ముందు అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ను రియాక్ట్ అయ్యేలా చేశాయి. 238 బిలియన్ డాలర్ల నికర ఆస్తులు కలిగిన బిలియనీర్ .. మార్చ్ ను వ్యతిరేకించినట్టు కనిపించింది. RCA మార్చ్ వీడియోను మళ్లీ పోస్ట్ చేస్తూ, ఎలోన్ ఓ ఆశ్చర్యార్థక గుర్తును షేర్ చేశాడు. ఒక అమెరికన్ బిలియనీర్ అయిన మస్క్ యాజమాన్యంలోని ప్లాట్‌ఫాంలో బిలియనీర్లను "పరాన్నజీవులు" అని పిలవడం మస్క్ కు కొంచెం ఇబ్బందిపెట్టే అంశమై ఉండొచ్చు. అందుకే అలా స్పందించారు అని నెటిజన్లు అంటున్నారు. 

2024 ఫిబ్రవరిలో స్థాపించబడిన రెవల్యూషనరీ కమ్యూనిస్టు ఆఫ్ అమెరికా కార్యకర్తలు కొత్త పార్టీ స్థాపన గురించి చర్చించేందుకు వందలాది మంది అమెరికన్ సహచరులతో సమావేశం అయినట్లు ట్వీట్ లో RCA రాసింది.  వ్యవస్థాపక సమావేశం ఫిలడెల్ఫియాలో జూలై 27 , 28 తేదీల్లో జరిగింది.. ఆ తర్వాత మార్చ్ నిర్వహించారు. 

RCA వెబ్‌సైట్ ప్రకారం.."మొదటి వారంలోనే కొత్త పార్టీలో చేరడానికి వందలాది మంది కమ్యూనిస్టులు దరఖాస్తు చేసుకోవడంతో పార్టీ ప్రారంభ ప్రకటన అద్భుతమైన ఉత్సాహాన్ని నిచ్చింది. అమెరికాలో వేలాది మంది విప్లవ కమ్యూనిస్టులు సంఘటితమై విప్లవం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని RCA  ట్వీట్ చేసింది. యుఎస్‌లో జరిగిన ఈ రాజకీయ పరిణామాన్ని అమెరికన్ మీడియా పెద్దగా కవర్ చేయలేదు. బహుశా అది ఫిలడెల్ఫియాలో యువతీ యువకుల సాధారణ  కవాతుగా భావించింది.