- మంత్రి అజయ్ అఫిడవిట్ తప్పుడు ఫార్మాట్లో ఉందన్న తుమ్మల
- హరీశ్ రావు కుటుంబ సభ్యుల వివరాలు సీక్రెట్‌గా ఉంచారన్న బీజేపీ
- అలంపూర్ బీఆర్ఎస్ అభ్యర్థిపై ఆర్వోకు కంప్లైంట్
ఖమ్మం/సిద్దిపేట రూరల్/ హనుమకొండ /జోగిపేట/-అలంపూర్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సోమవారం ముగియడంతో.. అపొజిషన్ నేతలు అధికార పార్టీ లీడర్ల అఫిడవిట్లపై దృష్టి పెట్టారు. పలువురు అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇచ్చారని రిటర్నింగ్ అధికారులకు కంప్లైంట్చేశారు. అయితే, బీఆర్ఎస్ లీడర్లు ఉద్దేశపూర్వకంగానే అఫిడవిట్లలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రతిపక్ష లీడర్లు ఆరోపిస్తున్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ నామినేషన్ ను తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఆయన ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్ లో కాకుండా తప్పుడు ఫార్మాట్ నామినేషన్‌పత్రాలు, అఫిడవిట్ఇచ్చారని తుమ్మల ఆరోపించారు.‘డిపెండెంట్ కాలమ్‌లో ఎవరూ లేకపోతే ‘నిల్’ అని రాయకుండా, ఫార్మాట్ నే మార్చారు. ఎనిమిది కాలమ్స్‌లో వివరాలు ఇవ్వాల్సి ఉండగా, ఆరు కాలమ్స్లోనే నింపారు. ఈ విషయాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తే వాటిని పట్టించుకోకుండా నామినేషన్ ను యాక్సెప్ట్ చేశారు’ అని తుమ్మల ఆరోపించారు.
దీనిపై కలెక్టర్ కు, రాష్ట్రఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ విషయంపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. కాగా, తుమ్మల ఆరోపణలను మంత్రి అజయ్ ఖండించారు. రిటర్నింగ్ ఆఫీసర్ ను తుమ్మల బెదిరించాలని చూస్తున్నారన్నారు. చెప్పింది ఒప్పుకోకపోతే అధికారులనే బెదిరిస్తారా? అని అజయ్ మండిపడ్డారు.
క్రాంతి అఫిడవిట్‌పై ఫిర్యాదు
బీఆర్ఎస్ అభ్యర్థి చంటి క్రాంతికిరణ్ ఫైల్ చేసిన అఫిడవిట్లో పూర్తి వివరాలు లేవని, అతని నామినేషన్ నుతిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహఏజెంట్లు అద్దంకి వీరన్న, హైకోర్టు లాయర్లు రాంబాబు, శ్రీధర్అందోల్ రిటర్నింగ్ అధికారి పాం డుకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న ఆస్తులు, అప్పులు అఫిడవిట్లో చెప్పాలని, కానీ ఆ వివ రాలేవీ అందులో చెప్పలేదని వారు ఆరోపించారు.
అలంపూర్ లో రిటర్నింగ్ ఆఫీసర్ వెహికల్ అడ్డగింత
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడని, జాబ్‌కు రిజైన్ చేయకుండా నామినేషన్ వేశాడని, అతని నామినేషన్ ను తిరస్కరించాలని కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న కుమార్ ఆర్వో చంద్రకళకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె వెహికల్ ను అడ్డుకుని నిరసన తెలిపారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత కొనసాగింది. అయితే, బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు ఉండవెల్లి మండలం పుల్లూరు లో ఫీల్డ్ అసిస్టెంట్ గా పని చేశాడని, అక్టోబర్ 28న ఉద్యోగానికి రాజీనామా చేశాడని, రాజీనామాను ఈ నెల 2న డీఆర్డీఏ ఆఫీసర్లు ధ్రువీకరించినట్లు ఉండవెల్లి ఎంపీడీవో ఆంజనేయరెడ్డి తెలిపారు.
ALSO READ : కాంగ్రెస్ వార్ రూమ్ కు కోఆర్డినేటర్ల నియామకం