- ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిపైనే ఆశలు
- ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను పట్టించుకోని గత సర్కారు
- లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ల పరిస్థితి ఇంతే..
- అధికారంలో వస్తే పూర్తి చేస్తామని కాంగ్రెస్ హామీ
నల్గొండ, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖను ఉమ్మడి జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్ రెడ్డికి కేటాయించడంతో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై ఆశలు చిగురిస్తున్నాయి. వైఎస్ హయాంలో మంజూరైన ఎస్‌ఎల్బీసీ, బ్రహ్మణ వెల్లంల ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసేంది. సీఎం కేసీఆర్ హయాంలో శంకుస్థాపన చేసిన డిండి లిఫ్ట్ , నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద శాంక్షన్ చేసిన 11 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు కూడా పెడింగ్‌లోనే ఉన్నాయి.
కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాజెక్టులనే ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలో రాగానే కంప్లీట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు, అది కూడా నాగార్జునసాగర్ఆయకట్టు పరిధిలోని హుజూర్నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ బాధ్యతలు చేపట్టడంతో ఆ దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆగిన లిఫ్ట్ పనులు
నాగార్జునసాగర్ప్రాజెక్టు ఎడమ కాల్వ పరిధిలో నిర్మిస్తున్న ఐదు లిఫ్ట్ఇరిగేషన్ స్కీమ్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ముఖ్యంగా సాగర్ఉప ఎన్నికల్లో మార్మోగిన నెల్లికల్లు లిఫ్ట్ సైతం ముందుకు సాగడం లేదు.
అంతేకాదు హుజూర్‌నగర్‌లో నిర్మించే లిఫ్ట్ స్కీంలో భారీ అవతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు రిపోర్టులను పున:పరిశీలించాకే పనులు మొదలు పెట్టాలని ఇంజినీరిం గ్ నిపుణులు కోరుతున్నారు. సాగర్ఎడమ కాల్వ లైనింగ్పనుల్లో భారీ అవతవకలు జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. కాస్త ఎక్కువ నీటి ప్రవాహం వస్తే కాల్వల కట్టలు తెగిపోవడమే ఇందుకు నిదర్శమని రైతులు మండిపడుతున్నారు.
డిండి లిఫ్ట్ కూడా..
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 2015లో సీఎం కేసీఆర్శంకుస్థాపన చేసిన డిండి లిఫ్ట్ఇరిగేషన్ పనులు కూడా నిలిచిపోయాయి. దీనికింద 9 రిజర్వాయర్లు ఉండగా.. ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయకపోవడంతో కాంట్రాక్టర్ నక్కలగండి రిజర్వాయర్‌ను మధ్యలో వదిలేశాడు. పెండ్లిపాకల రిజర్వాయర్‌కు ఫారెస్ట్ క్లియరెన్స్ రాకపోవడంతో పెండింగ్‌లో పడింది.
అంతేకాదు అసలు డిండి ప్రాజెక్టుకు నీటిని ఏదుల రిజర్వాయర్ నుంచి తేవాలా..? వట్టెం రిజర్వాయర్ నుంచి తీసుకురావాలా..? అనే దానిపై ఇప్పటి వరకు క్లారి టీ లేదు. పైగా భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం కూడా ఆలస్యం చేశారు. ఈ ప్రాజెక్టులకు పుష్కలంగా నిధులు కే టాయిస్తే నల్గొండ, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాలు సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉంది.
వీటితో పాటు బస్వాపురం రిజర్వాయర్ , గందమళ్ల రిజర్వాయర్ పనులు కూడా పూర్తి కాలేదు. అలాగేకోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో అందించాల్సి ఉంది.