నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ ఇంఛార్జ్ వీసీగా ప్రొఫెసర్ గోవర్థన్ నియమించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు రోజుల్లో ప్రొ. గోవర్థన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ట్రిపుల్ మాజీ ఇంఛార్జ్ వీసీ వెంకటరమణపై అనేక ఆరోపణలు రావడంతో తొలగించారు. వెంకటరమణ స్థానంలో జేఎన్ టీయూ ప్రొ.గోవర్థన్ కు బాధ్యతలు అప్పగించారు.
వెంకటరమణ అక్రమాలు, ఉద్యోగులను వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఓయూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆందోళనలు చేసింది.ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి వినతి పత్రం కూడా అందజేశారు.