శివరాత్రిని తలపించిన ఎములాడ

శ్రావణ మాసంలోని చివరి సోమవారం కావడంతో సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఎటుచూసినా భక్తులే కనిపించారు. ఆలయ పరిసరాలు శివరాత్రి జాతరను తలపించాయి. ధర్మగుండంలో స్నానం చేసి తడి బట్టలతోనే భక్తులు శీఘ్ర దర్శనానికి వెళ్లారు. 

ALSO READ:మిషన్ ​భగీరథ ఆఫీసర్ల నిర్లక్ష్యంతో చేయి కోల్పోయిన కాంట్రాక్ట్​ మెకానిక్

కోడె మొక్కులు చెల్లించుకునేందుకు బారులు తీరారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పట్టిందని తెలిపారు. మహిళలు, చిన్న పిల్లలు కొంత ఇబ్బంది పడ్డారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయానికి వచ్చే ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్​స్తంభించింది. ఉదయం 9 నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు వాహనదారులు నరకం చూశారు. 

- వేములవాడ, వెలుగు