GHMC లో 37మంది అధికారుల తొలగింపు

హైదరాబాద్: రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా GHMC విధుల్లో కొనసాగుతున్న 37 మంది అధికారులను విధులను తొలగించారు కమిషనర్ రోనాల్డ్ రాస్. మొత్తం 46 మంది ఉద్యోగులు ఎక్స్ టెన్షన్ పై విధులు నిర్వహిస్తున్నారు.మిగతావారిని వారికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగులను నియమించిన తర్వాత వారికి ఉద్వాసన పలుకుతామని రోనాల్డ్రాస్ అన్నారు.

రిటైర్ అయిన తర్వాత కూడా కొంతమంది అధికారులు బల్దియాలో ఏండ్ల తరబడి OSD లుగా కొనసాగుతున్నారు. కొందరిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలుండటంతో వారిని తొలగించామన్నారు. మేయర్ అభ్యర్థన మేరకు ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగులను తొలగించలేదని  జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు.

జీహెచ్ఎంసీలో రిటైర్డ్ ఆఫీసర్లపై కొత్త సర్కార్ ఫోకస్ పెట్టి వేటు వేస్తున్నది. ఐదారేండ్ల కిందట రిటైర్ మెంట్ అయినా కూడా.. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఇంకా కొనసాగుతున్నారు. వీరిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్​ ప్రభుత్వం బల్దియా ప్రక్షాళన మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రిటైర్డ్ అయి లాంగ్ స్టాండింగ్ లో అక్కడే తిష్టవేసిన వారి డీటెయిల్స్ కోరింది.

ALSO READ :- రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం వార్నింగ్

మొత్తం 46 మంది రిటైర్డ్ ఆఫీసర్లు పని చేస్తున్నట్లు సర్కార్ కు కమిషనర్ రిపోర్టు పంపారు. ప్రక్షాళనలో భాగంగా జీహెచ్ ఎంసీ లో విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించారు. వీరిస్థానంలో ఇతరులను నియమించనున్నారు.