కరీంనగర్ కు కేటీఆర్ వస్తుండని మహిళల అరెస్ట్ 

కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ మార్కెట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు మంత్రి కేటీఆర్ రానుండటంతో అక్కడున్న కొంతమంది మహిళా చిరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాశ్మీర్ గడ్డలో గతంలో ఉన్న రైతుబజారును కూల్చివేసి.. కొత్త రైతు బజార్ నిర్మిస్తుండటంతో తమకు ఉపాధి పోయిందని కొద్ది రోజులుగా చిరు వ్యాపారులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మహిళలను పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి వాహనంలో లాక్కెళ్లారు. 

కరీంనగర్ లోని మానేరు నదిపై రూ.224 కోట్లతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన తీగల వంతెనను మంత్రి కేటీఆర్‌ బుధవారం (జూన్ 21న) ప్రారంభించనున్నారు. మానేరు నదిపై కరీంనగర్‌ నుంచి సదాశివపల్లి మీదుగా వరంగల్‌ ప్రధాన రోడ్డుకు కలిసేలా దీనిని నిర్మించారు.