ఢిల్లీకి నితీశ్.. అదే ఫ్లైట్లో తేజస్వీ యాదవ్

ఢిల్లీకి నితీశ్.. అదే ఫ్లైట్లో తేజస్వీ యాదవ్

లోక్ సభ ఎన్నికల ఫలితాల అనంతరం ఎన్డీఏ కూటమిలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలకంగా మారారు.  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మెజార్టీ స్థానాలు రాకపోవడంతో  వీరిద్దరూ కీ రోల్ అయ్యారు.  ఈ క్రమంలో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు,పై చర్చించేందుకు ఇటు ఎన్డీఏ, అటు ఇండియా కూటమి సమావేశాలు ఏర్పాటు చేశాయి. ఈ మీటింగ్ కు హాజరు కావడానికి  బీహార్ సీఎం నితీశ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి బయలుదేరారు.  

అయితే అదే ఫ్లైట్ లో ఆర్జేడీ నేత, అపోజిషన్ లీడర్ తేజస్వీ యాదవ్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఢిల్లీకి బయల్దేరారని ప్రచారం జరుగుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో ఎన్డీఏ కూటమి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీకి మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి వెళ్తున్నట్లు ముందుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కూటమి మారుస్తారా? అనే చర్చ మొదలైంది. 

అయితే జేడీయూ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్డీయే బ్లాక్‌లోనే కొనసాగుతుందన్నారు. ఇండియా కూటమిలో చేరుతుందనే ఊహాగానాలను తిరస్కరించారు. లోక్ సభ ఎన్నికలకు ముందు ఇండియా కూటమిలోనే ఉన్న నితీష్ కుమార్..విపక్ష పార్టీలన్నింటిని ఏకతాటిపైకి తేవడంలో సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా బీహార్ లో   కొన్నిరోజుల పాటు నితీశ్,  తేజస్వీ యాదవ్  ప్రభుత్వాన్ని నడిపారు.   ఎప్పటికప్పుడు పొత్తులు మార్చడంలో పేరుమోసిన నితీశ్ కుమార్ ఇప్పుడు ఏం చేయనున్నారన్నది ఆసక్తికరంగా మారింది.